కరోనా మృతుల ఇంట్లో దొంగతనం

ABN , First Publish Date - 2021-05-20T06:52:53+05:30 IST

నిర్మల్‌ జిల్లా న్యూవెల్మల్‌ గ్రామంలో ఒకే కుటుంబంలో కరో నాతో ముగ్గురు మృతి చెందారు. ముగ్గురి మృతి విషాదంలో ఉన్న వారి కుటుంబసభ్యులను మరో సంఘటన కలిచి వేసింది.

కరోనా మృతుల ఇంట్లో దొంగతనం
సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు, కుటుంబ సభ్యులు

సోన్‌, మే 19 : నిర్మల్‌ జిల్లా  న్యూవెల్మల్‌ గ్రామంలో ఒకే కుటుంబంలో కరో నాతో ముగ్గురు మృతి చెందారు. ముగ్గురి మృతి విషాదంలో ఉన్న వారి కుటుంబసభ్యులను మరో సంఘటన కలిచి వేసింది. కరోనాతో మృతి చెంది కుటుంబా నికి పెద్దదిక్కును కోల్పోగా కుటుంబం చిన్నాభిన్నమై ఇంట్లో ఎవరూ లేని సమ యంలో దొంగలు చొరబొడ్డారు. చేతికందిందంతా తీసుకెళ్లారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఎస్సై ఆసీఫ్‌ గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం నిర్మల్‌ జిల్లా సోన్‌ మండలంలోని న్యూవెల్మల్‌ గ్రామానికి చెందిన భార్యభర్తలు బచ్చు ప్రేమ లత, కిషన్‌లతో పాటు కుమారుడు రాజ్‌కుమార్‌ గత ఇరవై రోజుల క్రితం వరుసగా కరోనాతో మృతి చెందారు. రాజ్‌కుమార్‌ భార్య పిల్లలు ఇంటి వద్ద లేకపోవడంతో అదునుచూసిన దొంగలు మంగళవారం అర్ధరాత్రి ఇంట్లో చొరబడి ఇరవై వేల రూపాయల విలువ గల కిరాణా సామాగ్రితో పాటు నగదును దొంగి లించుకుపోయినట్లు ఎస్సై తెలిపారు. కరోనాతో ముగ్గురు మృతి చెంది కుటుం బం వీధిపాలు కాగా దొంగతనం జరగడంతో గ్రామంలో భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యులు రాజ్‌కుమార్‌, గంగాధర్‌ ఇచ్చిన ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. 

Updated Date - 2021-05-20T06:52:53+05:30 IST