భైంసా పట్టణంలో కార్డన్‌సెర్చ్‌

ABN , First Publish Date - 2021-04-07T05:30:00+05:30 IST

భైంసా పట్టణంలో బుధవారం రోజున ఉదయం పోలీసులు కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహించారు.

భైంసా పట్టణంలో కార్డన్‌సెర్చ్‌
భైంసాలోని కుంట ప్రాంతంలో పర్యటిస్తున్న అదనపు ఎస్పీ కిరణ్‌ ప్రభాకర్‌కారే

అసాంఘిక కార్యకలాపాలు తగ్గించడానికే కార్యక్రమం

ఫఅదనపు ఎస్పీ కిరణ్‌ ప్రభాకర్‌ కారే

భైంసా క్రైం, ఏప్రిల్‌ 7 : భైంసా పట్టణంలో బుధవారం రోజున ఉదయం పోలీసులు కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహించారు. అసాంఘిక కార్యకలాపాలు నివారించడానికి కార్డెన్‌ అండ్‌ సెర్చ్‌ నిర్వహిస్తున్నామని అదనపు ఎస్పీ కిరణ్‌ ప్రభాకర్‌కారే అన్నారు. భైంసా పట్టణం లోని కుంట ఏరియాలో అదనపు ఎస్పీ కిరణ్‌ప్రభాకర్‌కారే ఆధ్వర్యంలో బుధవారం ఉదయం కార్డెన్‌ అండ్‌ సెర్చ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ ప్రజల రక్షణ గురించి, ఎవరైనా కొత్త వ్యక్తులు గానీ, నేరస్తులు గానీ వచ్చిషెల్టర్‌ తీసుకుంటున్నారా అనే విషయం కూడా తెలుస్తుందని, నేరరహిత పట్టణాలు మరియు గ్రామాలుగా చేయాలనే ఉద్దేశ్యంతో ఈ కార్డెన్‌అండ్‌సెర్చ్‌ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ సెర్చ్‌లో అనుమానితుల ధృవీకరణ పత్రాలను పరిశీలించగా, అలాగే సరైన పత్రా లు లేని దాదాపు 80 ద్విచక్ర వాహనాలను, 9 త్రిచక్ర వాహనాలను, రెండు కారులను సీజ్‌ చేశారు. అలాగే నిషేధిత గుట్కాను, 7 చీప్‌ లిక్కర్‌ బాటిల్స్‌ను పట్టుకున్నామన్నారు. ఈ సందర్భంగా ఏఎస్పీ కిరణ్‌ ప్రభాకర్‌కారే మాట్లాడుతూ ప్రతీఒక్కరూ తప్పనిసరిగా వారి యొక్క వాహనాలకు ఆర్‌సీ, ఇన్సూరెన్స్‌, మరి యు డ్రైవింగ్‌ లైసెన్స్‌ కలిగి ఉండాలని తెలిపారు. మోటార్‌సైకిల్‌ వాహనదారులు తప్పకుండా హెల్మెట్‌ ధరించాలన్నారు. రోజురోజుకూ కరోనా అధికమవుతున్న క్రమంలో రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వుల మేరకు ప్రజలు తప్పక మాస్క్‌లు ధరించాలన్నారు.  కరోనా సెకండ్‌వేవ్‌ కేసులసంఖ్య గణనీయంగా పెరుగుతున్నాయని. కావునా కరోనావ్యాధిని నియంత్రించడం కేవలం మాస్క్‌, భౌతికదూరం ద్వారా సాధ్య పడుతుందని, కావునా ప్రజలు బహిరంగ ప్రదేశాలకు వచ్చినప్పుడు తప్ప నిసరిగా మాస్క్‌ను ధరించాలని అన్నారు. ఎవరైనా వ్యక్తులు మాస్క్‌ ధరించ కుండా బహిరంగ ప్రదేశాల్లో సంచరించినట్లైతే వారిపై విపత్తు నిర్వహణ చట్టంలోని 51 నుండి 60 సెక్షన్లు, 188 ఐపీసీ ప్రకారం సదరు వ్యక్తులపై తీసుకునే చర్యల్లో భాగంగా జరిమానాలను విధించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్డెన్‌సెర్చ్‌లో సీఐలు, ఎస్సైలు, దాదాపు 150 మంది కానిస్టేబుల్స్‌, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-04-07T05:30:00+05:30 IST