ఎగ్గాం గ్రామ సమీపంలో వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-10-29T06:20:12+05:30 IST

మండలంలోని ఎగ్గాం గ్రామ సమీపం లోని డంపింగ్‌ యార్డ్‌ వద్ద తమిళనాడుకు చెందిన గణేష్‌(55) అనే వ్యక్తి మృతి చెందినట్లు భైంసారూరల్‌ ఏఎస్సై బాల్‌సింగ్‌ తెలిపారు.

ఎగ్గాం గ్రామ సమీపంలో వ్యక్తి మృతి

భైంసా రూరల్‌, అక్టోబరు 28 : మండలంలోని ఎగ్గాం గ్రామ సమీపం లోని డంపింగ్‌ యార్డ్‌ వద్ద తమిళనాడుకు చెందిన గణేష్‌(55) అనే వ్యక్తి మృతి చెందినట్లు భైంసారూరల్‌ ఏఎస్సై బాల్‌సింగ్‌ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం తమిళనాడుకు చెందిన గణేష్‌ గత కొన్నేళ్ల క్రితం భైంసా పట్టణానికి వచ్చాడు. చెత్తా చెదారంలో ప్లాస్టిక్‌ వ్యర్థాలు, ఇతర సామాగ్రిని ఏరుకుని వాటిని విక్రయించి వచ్చిన డబ్బులతో జీవనం నెట్టుకొస్తున్నాడు. డంపింగ్‌యార్డ్‌ సమీపంలో ఉన్న నీటికుంటలో ప్రమాదవ శాత్తు పడిమరణించాడు. పోలీసులు కుటుంబికులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2021-10-29T06:20:12+05:30 IST