ఇలేగాం గ్రామంలో కార్డన్‌సెర్చ్‌

ABN , First Publish Date - 2021-10-29T06:18:55+05:30 IST

భైంసా మండలం ఇలేగాం గ్రామంలో గురువారం కార్డెన్‌సెర్చ్‌ సీఐ చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఇలేగాం గ్రామంలో కార్డన్‌సెర్చ్‌
ఇలేగాం గ్రామంలో మాట్లాడుతున్న సీఐ చంద్రశేఖర్‌

భైంసా రూరల్‌, అక్టోబరు 28 : భైంసా మండలం ఇలేగాం గ్రామంలో గురువారం కార్డెన్‌సెర్చ్‌ సీఐ చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉద యాన్నే ఇంటింటా సోదాలు చేశారు. వాహనపత్రాలను, ఆధార్‌కార్డులను పరిశీలించి, అనంతరం ప్రభుత్వ పాఠశాలల సమావేశం ఏర్పాటు చేశారు. సీఐ చంరద్రశేఖర్‌ మాట్లాడుతూ... గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలు సా గించే అవకాశం లేకుండా నిఘా ఏర్పాటు చేసి గట్టిచర్యలు తీసుకుంటా మన్నారు. ఈ కార్యక్రమంలో పత్రాలు లేని 93 ద్విచక్ర వాహనాలు, 3 ట్రాక్టర్ల, 8 ఆటోలు స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ఈ కార్డెన్‌సెర్చ్‌లో భైంసా రూరల్‌ ఎస్సై సాయికిరణ్‌, కుంటాల ఎస్సై శ్రీకాంత్‌, కుభీర్‌ ఎస్సై ప్రభాకర్‌రెడ్డితో పాటు 100 మంది పోలీసులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-29T06:18:55+05:30 IST