కష్టాల్లో కాంట్రాక్టు లెక్చరర్లు

ABN , First Publish Date - 2021-01-14T05:19:20+05:30 IST

ప్రభుత్వ కళాశాలల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లకు కష్టాలు తప్పడం లేదు.

కష్టాల్లో కాంట్రాక్టు లెక్చరర్లు
సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న లెక్చరర్లు

ఎటూతేలని సర్వీస్‌ల క్రమబద్ధీకరణ

ప్రభుత్వ లెక్చరర్లతో సమానంగా విధులు

సమయానికి వేతనాలు అందక ఇబ్బందులు

అమలుకు నోచుకోని జీవో 16

సీఎం ఆదేశించి 2 నెలలైనా అమలు కాని బదిలీల ప్రక్రియ

కరోనాకాలంలో తప్పని ఆర్థిక ఇబ్బందులు

ఉద్యోగభద్రతపై కనికరించని ప్రభుత్వం

దూరభారంతో సైతం విధుల్లో మహిళా లెక్చరర్లు

సోన్‌, జనవరి 13 : ప్రభుత్వ కళాశాలల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లకు కష్టాలు తప్పడం లేదు. తెలంగాణ ప్ర త్యేక రాష్ట్రం ఏర్పడితే కాంట్రాక్టు అనే పద మే ఉండదని చెప్పిన మాటలు కాగితాలకే పరిమితం అయ్యాయి. ప్రత్యేక రాష్ట్రసాధనలో సైతం ముందుండి పోరాడిన కాంట్రాక్టు లెక్చరర్లకు చేదు అనుభవాలే మిగిలిపోయాయి. ప్రత్యేకరాష్ట్రం ఏర్ప డితే తమ బతుకులు మారుతాయని అనుకుంటే మొదటికే వచ్చాయి. సమస్యల సాధన కోసం ప్రజా ప్రతినిధుల, అధికారుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినా ఫలితం మాత్రం శూన్యం. గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెర వేర్చకపోవడంతో కుటుంబ పోషణభారంగా మారింది. కష్టపడి విధులు నిర్వహి స్తున్న నెలల తరబడి వేతనాలు అందక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవు తున్న పరిస్థితులు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ బదిలీ ప్రక్రియకు ఆదేశించి రెండు నెలలు అవుతున్నా అమలుకు నోచుకోకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. బదిలీల ప్రక్రియ అమలు కాకపోవడంతో దూరభారంతో సైతం విధులకు హాజరు అవుతున్న మహిళా లెక్చరర్ల బాధలు వర్ణనాతీతం. వివరాలు ఇలా ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ప్రభుత్వ కళాశాలల్లో 264 మంది కాంట్రాక్టు లెక్చరర్లు తమ విధులను నిర్వర్తిస్తున్నారు. ప్రభుత్వ కళాశాలలను బలోపేతం చేయడానికి 2000 సంవత్సరంలో స్థానిక త్రిమాన్‌ కమిటీల ఆధారంగా స్థానికులకు అవకాశం ఇస్తూ కాంట్రాక్టు లెక్చరర్లను నియమించడం జరిగింది. అనంతరం 2007 సంవత్సరంలో ఆర్‌జేడీ ఆదేశానుసారంగా జోనల్‌ వ్యవస్థను అమలు చేస్తూ లెక్చరర్ల నియామకం జరిపారు. అయితే గత 13 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో 4500 గౌరవవేతనంతో ప్రారంభమై అనేక కష్టనష్టాలకు ఓరుస్తూ సమస్యల సాధన కోసం ఉద్యమించారు. ఉద్యోగభద్రత కల్పించాలని, గౌరవవేతనాలు పెంచాలని బదిలీల ప్రక్రియను అమలు చేయాలని సమ్మె చేసిన సందర్భాలు సైతం చాలా ఉన్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన అనంతరం తమ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పిన హామీలు హామీలుగానే మిగిలిపోయాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఎటూ తేలని సర్వీసుల క్రమబద్ధీకరణ

ప్రభుత్వ లెక్చరర్లతో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లకు సర్వీసుల క్రమబద్ధీకరణ అమలు కాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సర్వీసు ల క్రమబద్ధీకరణ అమలు కాకపోవడంతో ఉద్యోగానికి రక్షణ లేకుండా పో యిందని మానసిక క్షోభతో సతమతం అవుతున్నారు. అన్ని అర్హతలు ఉండి కూడా క్రమబద్ధీకరణ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వారు ఆవేదన చెందుతున్నారు.

ప్రభుత్వ లెక్చరర్లతో సమానంగా విధులు

చాలీ చాలని వేతనాలతో కష్టపడి ప్రభుత్వ లెక్చర ర్లతో సమానంగా విధులు నిర్వహిస్తున్నా నెలనెలా వేతనాలు అందక ఇబ్బందులు  పడవలసి వస్తుంది. రోజుల తరబడి వేతనాలతో నిరీక్షించి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగు తుందని కాంట్రాక్టు లెక్చరర్లు పేర్కొంటున్నారు. 

సీఎం ఆదేశించినా అమలుకాని బదిలీల ప్రక్రియ

కాంట్రాక్టు లెక్చరర్ల విధుల నిర్వహణ జోనల్‌పద్ధతిలో కొనసాగుతుంది. జోనల్‌ పద్ధతిలో కరీంనగర్‌, వరంగల్‌, ఆదిలాబాద్‌, ఖమ్మం జిల్లాల్లో ఎక్కడైనా విధులను నిర్వర్తించడానికి అవకాశం ఉంటుంది. దూరభారమైనప్పటికీ మహిళా లెక్చరర్లు సైతం ఇతర జిల్లాలో పనిచేయడం జరుగుతుంది. ఇందుకోసం ఈ సమస్యను ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ ్లగా సానుకూలంగా స్పందించి బదిలీల ప్రక్రియను అమలు చేయాలని ఆదేశించారు. దేవుడు కనికరించినా పూజారి కనికరించలేదనే చందంగా ముఖ్యమంత్రి ఆదేశించి రెండు నెలలు అవు తున్నా బదిలీలకు ఇంకా శ్రీకారం చుట్టలేదు. బదిలీలు ప్రారంభమైతే ఏ జిల్లా వారు వారి జిల్లా వెళ్లడంతో ఆర్థికభారం తగ్గడంతో పాటు కుటుంబ సభ్యులకు అందుబాటులో ఉండటం జరుగుతుంది. 

అమలుకాని జీవో నెంబరు 16

కాంట్రాక్టు లెక్చరర్లకు సంబంధించిన జీవోనెంబరు 16 అమలు కాకపోవడంతో వీరి సమస్యలు మొదటికి వచ్చిందని చెప్పవచ్చు. గతంలో కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులర్‌ చేయడానికి రాష్ట్ర మంత్రివర్గంలో తీర్మానం చేసి జీవోనెంబరు 16 జారీ చేసిన కోర్టు కేసుతో ఈ క్రమబద్ధీకరణకు ఆదిలోనే బ్రేక్‌ పడింది. 

కరోనా సమయంలో తప్పని ఇబ్బందులు

కరోనాసమయంలో కూడా కాంట్రాక్టు లెక్చరర్ల ఇబ్బందులు తప్పలేదు. కేవ లం గౌరవవేతనాలపై ఆధారపడి ఉన్న వారికి ఆర్థిక ఇబ్బందులతో కుటుంబ పోషణ భారంగా మారింది. లాక్‌డౌన్‌ సమయంలో వేతనాలు లేక కూలీ పను లకు సైతం వెళ్లి జీవనం కొనసాగించారు. ప్రభుత్వం ఇప్పటికైనా పట్టించుకొని తమ సమస్యలను పరిష్కరించి తమకు న్యాయం చేయాలని కాంట్రాక్టు లెక్చరర్లు వేడుకుంటున్నారు. 

బదిలీల ప్రక్రియను వెంటనే అమలు చేయాలి

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన మాట ప్రకారం కాంట్రా క్టు లెక్చరర్లకు సంబంధించిన బదిలీల ప్రక్రియ అమలుకు వెంటనే చర్యలు తీసుకోవాలి. ముఖ్యమంత్రి ఆదేశించి రెండు నెలలు అవుతున్నా ఆచరణ కావడం లేదు. అమలు చేయడానికి స్పష్టమైన వైఖరిని వెల్లడించాలి.

- జి. ప్రేమ్‌కుమార్‌, కాంట్రాక్టు అధ్యాపకుడు

ఉద్యోగ భద్రత కల్పించాలి

ఎంతో కష్టపడి విధులు నిర్వహిస్తున్నాం. కానీ ఉద్యోగ భద్రత విషయంలో నిర్లక్ష్యం చేయడం తగదు. తెలంగాణ రాష్ట్రం కోసం గతంలో ఎంతో ముందున్నాం. ప్రభుత్వం వెంటనే పట్టించుకొని న్యాయం చేయాలి.

- కే. వినోద్‌కుమార్‌, జిల్లా జిల్లా కాంట్రాక్టు అఽధ్యాపకుల సంఘం అధ్యక్షుడు

పది సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్నాను

పది సంవత్సరాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. జగిత్యాల జిల్లా నుంచి నిర్మల్‌కు వచ్చి విధులు నిర్వహిసు ్తన్నాను. ప్రభుత్వం బదిలీల విషయంలో ఖచ్చితమైన నిర్ణయం ప్రకటించాలి.

- బి. దేవస్వరూప, కాంట్రాక్టు అధ్యాపకురాలు సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న లెక్చరర్లు

Updated Date - 2021-01-14T05:19:20+05:30 IST