కదం తొక్కిన కాంగ్రెస్‌

ABN , First Publish Date - 2021-07-13T04:01:19+05:30 IST

పెట్రోలు, డీజిల్‌ ధరల పెంపుపై కాంగ్రెస్‌ నాయకులు కదం తొక్కారు. ఏఐసీసీ పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్‌రావు, డీసీసీ అధ్యక్షురాలు సురేఖ ప్రేంసాగర్‌రావుల నేతృత్వంలో సోమవారం జిల్లా కేం ద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రేంసాగర్‌రావు నివాసం నుంచి ప్రారంభమైన ర్యాలీ కలెక్టరేట్‌ వరకు సాగింది.

కదం తొక్కిన కాంగ్రెస్‌
ర్యాలీలో పాల్గొన్న మాజీ ఎంపీ రాజయ్య, మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు

ఇంధన ధరలు పెంపుపై నిరసన

భారీగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు

ప్రభుత్వాల వైఖరిని ఎండగట్టిన మాజీ ఎమ్మెల్సీ

మంచిర్యాల, జూలై 12 (ఆంధ్రజ్యోతి): పెట్రోలు, డీజిల్‌ ధరల పెంపుపై కాంగ్రెస్‌ నాయకులు కదం తొక్కారు. ఏఐసీసీ పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్‌రావు, డీసీసీ అధ్యక్షురాలు సురేఖ ప్రేంసాగర్‌రావుల నేతృత్వంలో సోమవారం జిల్లా కేం ద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రేంసాగర్‌రావు నివాసం నుంచి ప్రారంభమైన ర్యాలీ కలెక్టరేట్‌ వరకు సాగింది. ఈ సందర్భంగా మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య మాట్లాడుతూ నిత్యావసర సరుకుల ధరల పెంచుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమిం చాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ర్యాలీకి పరిశీ లకుడిగా వచ్చిన ఆయన ప్రభుత్వాల వైఖరిపై ధ్వజ మెత్తారు. డీసీసీ అధ్యక్షురాలు సురేఖ మాట్లాడుతూ పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరగడం వల్ల సామా న్యుల పై మోయలేని భారం పడుతుందన్నారు. ధరలు విప రీతంగా పెంచడం వల్ల పేద, మధ్య తరగతి కుటుం బాలపై ఆర్థిక భారం అధికమవుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. మాజీ ఎమ్మెల్సీ, ఏఐసీసీ సభ్యులు ప్రేంసాగర్‌రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెట్రో లు, డీజిల్‌, వంట గ్యాస్‌ ధరలను అదుపు చేయడంలో విఫలమైందని ఆరోపిం చారు. కాంగ్రెస్‌ అధికారం లో ఉన్న సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగినప్పటికీ పెట్రోలు, డీజిల్‌ ధరలు పెంచ లేదన్నారు. నరేంద్రమోదీ ప్రభుత్వం అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తక్కువగా ఉన్నప్పటికీ ఇంధన ధరలు పెంచుకుంటూ పోతుందని ధ్వజమె త్తారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తుందని భరోసా ఇచ్చారు. టీపీసీసీ అధికార ప్రతినిధి చిట్ల సత్యనారాయణ, కార్య దర్శి రఘునాథ్‌ రెడ్డి, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు పూదరి తిరుపతి, పట్టణ అధ్యక్షుడు అంకం నరేష్‌, మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి హేమలత, జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత తోపాటు మంచిర్యాల, నస్పూర్‌ మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్లు రావుల ఉప్పలయ్య, సురిమిల్ల వేణు, డిప్యూటీ ఫ్లోర్‌లీడర్లు వేములపల్లి సంజీవ్‌, అబ్దుల్‌ మజీద్‌తో పాటు జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, కాంగ్రెస్‌ అనుబంధ సం ఘాల జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు. అనంతరం అద నపు కలెక్టర్‌ మధుసూధన్‌నాయక్‌కు వినతిపత్రం అం దజేశారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలి రాగా నల్ల బ్యాడ్జీలు ధరించి ఎడ్లబండ్లు, సైకిళ్లతో ర్యాలీలో పాల్గొన్నారు.  రహదారుల వెంట కాంగ్రెస్‌ నాయకులు పాదయాత్ర నిర్వహిస్తూ జై పీఎస్సార్‌ నినాదాలతో  ప్రజలకు అభివాదం చేశారు. 

పీఎస్సార్‌, వినోద్‌ చెరోదారి

ఏఐసీసీ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలో నిర్వహిం చిన నిరసన ర్యాలీ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ ప్రేం సాగర్‌రావు, మాజీ మంత్రి గడ్డం వినోద్‌లు ఎడమొ హంపెడమొహంగా వ్యవహరించారు. పీఎస్సార్‌ దాదా పు రెండు వేల మందితో ర్యాలీలు నిర్వహించగా, వినోద్‌ తన అనుచరులతో వచ్చి ర్యాలీలో కలిసి ముందుకు సాగారు. కార్యక్రమం మొత్తం ఎక్కడా కూడా ఇద్దరు నేతలు ఒకరినొకరు పలుకరించుకోలేదు. పెట్రోలు, డీజిల్‌ ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ జిల్లా అదనపు కలెక్టర్‌కు రెండు వర్గాలు వేర్వేరుగా వినతిప త్రాలు అందజేశాయి. అనంతరం గడ్డం వినోద్‌ అంబే ద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.  ఐఎన్‌టీయూసీ జాతీయ కార్యదర్శి జనక్‌ప్రసాద్‌, మాజీ ఎమ్మెల్యేలు సంజీవరావు, శ్రీదేవి,  దయానంద్‌, కేవీ ప్రతాప్‌, రాంశెట్టి నరేందర్‌ పాల్గొన్నారు. 

ఆకట్టుకున్న ఎడ్లబండ్ల ప్రదర్శన

ఏసీసీ : పెరిగిన పెట్రోలు, డీజిల్‌ ధరలకు నిరసనగా చేపట్టిన ర్యాలీలో ఎడ్లబండ్లు, సైకిల్‌ ర్యాలీ ప్రజలను ఆకట్టుకుంది. దాదాపు 80 ఎడ్లబండ్లు, 200 సైకిళ్ళతో మంచిర్యాల పట్టణ వీఽధుల గుండా భారీ ర్యాలీ చేపట్టారు. దాదాపు 2 గంటల సేపు ర్యాలీ కొనసాగింది. పట్టణంలో ఎక్కడ చూసినా కాంగ్రెస్‌ పార్టీ జెండాలు రెపరెపలాడాయి. 

 

Updated Date - 2021-07-13T04:01:19+05:30 IST