పోలీసుశాఖ ఆధ్వర్యంలో పోటీలు

ABN , First Publish Date - 2021-10-14T06:15:54+05:30 IST

ఈ నెల 21న పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీసుశాఖ ఆధ్వర్యం లో వివిధ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నామని ఎస్పీ సీహెచ్‌. ప్రవీణ్‌ కుమార్‌ తెలిపారు.

పోలీసుశాఖ ఆధ్వర్యంలో పోటీలు

నిర్మల్‌ కల్చరల్‌, అక్టోబరు 13: ఈ నెల 21న పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీసుశాఖ ఆధ్వర్యం లో వివిధ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నామని ఎస్పీ సీహెచ్‌. ప్రవీణ్‌ కుమార్‌ తెలిపారు. జాతి నిర్మాణంలో పోలీసుల పాత్ర అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. షార్ట్‌ ఫిలిం, ఫొటోగ్రఫి పోటీలు, పోలీసు విధులు, అత్యవసర సేవలు, ధైర్య సాహసాలపై పోటీలు ఉంటాయని తెలిపారు. వ్యాసరచన తెలుగు, ఇంగ్లీష్‌, ఉర్దూ భాషల్లో రాయొచ్చని, 8 వ తరగతి నుంచి డిగ్రీ విద్యార్థులు పాల్గొనవచ్చన్నారు. ఈ నెల 23 వరకు, షార్ట్‌ ఫిలిం, ఫొటోగ్రఫీ పోటీలకు ఈ నెల 27 వరకు అప్లోడ్‌ చేయాలని సూచించారు. పూర్తి వివరాలకు 79011 22318, 9493 014303 నెంబర్లలో సంప్రదించాలన్నారు.
శాంతియుతంగా పండుగను జరుపుకోవాలి
భైంసా క్రైం, అక్టోబరు 13:  పట్టణ ప్రజలు పండుగను శాంతి యుతంగా జరుపుకోవాలని ఏఎస్పీ కిరణ్‌ కారే అన్నారు. దమ్మ చక్రపరివర్తన్‌ దివస్‌ సందర్భంగా ఆయన మాట్లాడారు. దుర్గా మాత ఊరేగింపు ఉత్సవాల సందర్భంగా భైంసా పట్టణంలో కోర్టు ఆదేశాల మేరకు ఎలాంటి డీజేలకు అనుమతి లేదన్నారు. పోలీ సులకు సహకరించాలన్నారు.

Updated Date - 2021-10-14T06:15:54+05:30 IST