‘మిర్చి’ బాధిత రైతులకు పరిహారం ప్రకటించాలి

ABN , First Publish Date - 2021-12-31T05:05:13+05:30 IST

మిర్చి తోటలకు తెగుళ్లు సోకి 90శాతం పంటలకు నష్టం వాటిల్లిందని, రాష్ట్రప్రభుత్వం కనీసం ప్రకటన ఇవ్వలేదని కాంగ్రెస్‌, సీపీఎం, సీపీఐ, ఎన్డీ పార్టీలు, అనుబంధ రైతు సంఘాల నాయకులు విమర్శించారు.

‘మిర్చి’ బాధిత రైతులకు పరిహారం ప్రకటించాలి
మాట్లాడుతున్న నాగేశ్వరరావు

మంత్రి కేటీఆర్‌ పర్యటనలో నల్లబ్యాడ్జీలతో నిరసన: విపక్ష నేతలు

ఖమ్మంసంక్షేమవిభాగం, డిసెంబరు30: మిర్చి తోటలకు తెగుళ్లు సోకి 90శాతం పంటలకు నష్టం వాటిల్లిందని, రాష్ట్రప్రభుత్వం కనీసం ప్రకటన ఇవ్వలేదని కాంగ్రెస్‌, సీపీఎం, సీపీఐ, ఎన్డీ పార్టీలు, అనుబంధ రైతు సంఘాల నాయకులు విమర్శించారు. సీపీఎం కార్యాలయం సుందరయ్య భవన్‌లో గురువారం విపక్ష పార్టీల నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నున్నా నాగేశ్వరరావు, గోకినపల్లి వెంకటేశ్వరరావు, శింగు నర్సింహారావు, పొన్నం వెంకటేశ్వరరావు మిక్కిలినేని నరేంద్ర మాట్లాడుతూ జిల్లాలో 1,20,000 ఏకరాల్లో మిర్చి పంట రైతులు సాగు చేయగా,  తెగుళ్లతో మిర్చి పంట చేతికి రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మిర్చి రైతుల పక్షాన ప్రతిపక్ష పార్టీలు ఎన్ని శాంతియుత ఉద్యమాలు చేసిన ప్రభుత్వం స్పందించలేదని విమర్శించారు. మిర్చి రైతులకు ఏకరానికి రూ.1లక్ష నష్ట పరిహారం ప్రకటించాలన్నారు. ఈ డిమాండ్‌తో ఖమ్మంలో పర్యటించనున్న  పురపాలక మంత్రి కేటీఆర్‌ కార్యక్రమాలను నల్లబ్యాడ్జీలు ధరించి అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో నాయకులు  యర్రా శ్రీకాంత్‌, వై విక్రమ్‌, ఆవుల అశోక్‌, కొండపర్తి గొవిందరావు, గుర్రం అచ్చయ్య, మాదినేని రమేశ్‌, ఆవుల వెంకటేశ్వర్లు, మలీదు నాగేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-31T05:05:13+05:30 IST