ప్రారంభమైన తునికాకు సేకరణ

ABN , First Publish Date - 2021-05-22T03:46:19+05:30 IST

జిల్లాలో తుని కాకు సేకరణ పనులు ప్రారంభమయ్యాయి. జన్నా రం, మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి అటవీ డివి జన్‌ల పరిధిలో ఈ యేడు 35,800 స్టాండర్డ్‌ బ్యాగు (ఎస్బీ)ల ఆకు సేకరణ లక్ష్యం నిర్ణయించగా మంద కొడిగా పనులు జరుగుతున్నాయి. తునికాకు సేకర ణలో గతంలో మాదిరిగా ప్రజలు ఆసక్తి చూపడం లేదు. గ్రామాల నుంచి తెల్లవారుజామున ప్రజలు అడవుల బాట పడుతుండగా కష్టానికి తగిన ఫలితం దక్కడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రారంభమైన తునికాకు సేకరణ
తునికాకును కట్టలు కడుతున్న మహిళలు

అడవుల బాట పడుతున్న కూలీలు

జిల్లాలో 35వేల స్టాండర్డ్‌ బ్యాగుల లక్ష్యం

అరకొర రేట్లతో ఆసక్తి చూపని ప్రజలు

వెంటాడుతున్న వన్యమృగాల భయం

మంచిర్యాల, మే 21(ఆంధ్రజ్యోతి): జిల్లాలో తుని కాకు సేకరణ పనులు ప్రారంభమయ్యాయి.  జన్నా రం, మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి అటవీ డివి జన్‌ల పరిధిలో ఈ యేడు 35,800 స్టాండర్డ్‌ బ్యాగు (ఎస్బీ)ల ఆకు సేకరణ లక్ష్యం నిర్ణయించగా మంద కొడిగా పనులు జరుగుతున్నాయి. తునికాకు సేకర ణలో గతంలో మాదిరిగా ప్రజలు ఆసక్తి చూపడం లేదు. గ్రామాల నుంచి తెల్లవారుజామున ప్రజలు అడవుల బాట పడుతుండగా కష్టానికి తగిన ఫలితం దక్కడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 50 ఆకులుగల కట్టకు కేవలం రూ.2 ఇస్తుండటంతో కూలీ కూడా పడటం లేదని ప్రజలు వాపోతున్నారు. ఇదిలా ఉండగా రవాణా సౌకర్యం లేకపోవడంతో ఎడ్లబండ్లు, కాలినడకన అడవుల్లోకి వెళ్లాల్లి వస్తోంది. మరోవైపు వన్యమృగాల భయం కూలీలను వెంటాడు తోంది. గ్రామాల చుట్టుపక్కల ఉన్న బీడు భూములు వ్యవసాయ భూములుగా మారడంతో అడవుల్లోకి వెళ్లక తప్పడం లేదు. సంబంధిత కాంట్రాక్టర్లు తుని కాకు సేకరణకు సంబంధించి ముందస్తుగా ప్రూనింగ్‌ (కొమ్మ కొట్టించడం) చేయలేదు. అడవుల్లో లోనికి వెళితేగాని ఆకు దొరికే పరిస్థితి లేదు. దీనికి తోడు గత సంవత్సరం సేకరించిన ఆకుల కట్టల బోనస్‌ కూడా ప్రభుత్వం చెల్లించకపోవడంతో ప్రజలు తునికాకు సేకరణపై ఆసక్తి చూపడం లేదు. 

జిల్లాలో లక్ష్యం ఘనం....

తునికాకు సేకరణకు సంబంధించి ఈ యేడాదికి  భారీ లక్ష్యాన్ని విధించారు. నాలుగు డివిజన్ల పరిధిలో  35,800 స్టాండర్డ్‌ బ్యాగుల ఆకు సేకరించడమే లక్ష్యంగా అటవీశాఖ అధికారులు ముందుకు సాగు తున్నారు. జన్నారం అటవీ డివిజన్‌లో 500 ఎస్బీలు, మంచిర్యాల డివిజన్‌ 8,100, చెన్నూరు డివిజన్‌లో 17,400, బెల్లంపల్లి డివిజన్‌లో 9800 ఎస్బీలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. లక్ష్యంలో ఇప్పటి వరకు జన్నారంలో కేవలం 50 ఎస్బీలు సేకరించగా, చెన్నూరులో 7,495, మంచిర్యాలలో 1,867, బెల్లంపల్లిలో 3,169 ఎస్బీల తునికాకును సేకరించారు. జూన్‌లో వర్షాకాలం ప్రారంభం అవుతుండగా లక్ష్యంపై నీలినీడలు అలుముకో నున్నాయి. ఇదిలా ఉండగా 2020 సంవత్సరం 70 శాతం మాత్రమే లక్ష్యం నెరవేరింది. గత సంవత్సరం జిల్లాలోని నాలుగు డివిజన్లలో 19,300 ఎస్బీలు లక్ష్యం కాగా సీజన్‌ ముగిసే సరికి కేవలం 13వేల పైచిలుకు ఎస్బీలు సేకరించగలిగారు. 

వెంటాడుతున్న వన్యమృగాల భయం...

తునికాకు సేకరణకు వన్యమృగాల భయం అడ్డుగా నిలుస్తోంది. అడవుల్లో ఇటీవల పులుల సంచారం పెరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. జిల్లాలోనూ పులి సంచారం ఉండటంతో అడవుల్లోకి వెళ్లేందుకు ప్రజలు జంకుతున్నారు. ముఖ్యంగా చెన్నూ రు డివిజన్‌లో పులి కదలికలు ఉన్నట్లు అటవీ అధికా రులు చెబుతుండటంతో తునికాకు సేకరించేందుకు ప్రజలు శ్రద్ధ కనబరచడం లేదు. దీనికి తోడు అటవీ ప్రాంతాల్లో ఇటీవలి కాలంలో పశువులు, మనుషులపై వరుసగా పులుల దాడులు జరగడం కూడా అడవుల్లోకి వెళ్లడానికి ఆటంకం ఏర్పడింది. 

వాహన సౌకర్యం కల్పించాలి....

తగరం మల్లయ్య, భీమారం

తెల్లవారుజామునే బయల్దేరి వెళ్లి అడవిలో ఐదారు కిలోమీటర్లు నడవాల్సి వస్తోంది. ఎడ్లబండ్లు కూడా  లేవు. కాలినడక వెళ్లడం వల్ల అలసటతో ఆకులు కోయలేకపోతున్నాం. ఉదయం 10 గంటల దాకా కోసి ఆకుల మూటలతో తిరిగి వచ్చి ఇంటిల్లిపాది పొద్దంతా కూర్చొని ఆకులు పేర్చి కట్టలు గట్టి కళ్లాలకు చేరవేస్తాం. కాంట్రాక్టరు రెండు నెలలు ముందుగా కొమ్మ కొట్టిస్తే ఆకులు పుష్కలంగా దొరికేవి. అధికారులు పట్టించుకోకపోవడంతో కాంట్రాక్టరు నిర్లక్ష్యం చేశాడు. గత సంవత్సరం కట్టలపై బోనస్‌ కూడా ఇయ్యలేదు. 

శ్రమకుతగ్గ ఫలితం లేదు

...ఆదే రవీందర్‌ వేమనపల్లి మండలం

ఉదయం అడవులోకి వెళ్లికి చెట్ల వెంట తిరిగి తునికి ఆకులను సేకరిస్తున్నాం. ఎంతో శ్రమకోర్చి కట్టలు కట్టి కళ్లాల్లో విక్రయిస్తే 50 ఆకులు గల ఒక్కో కట్టకు రూ.2 చెల్లిస్తున్నారు. పొద్దస్తమానం కష్టపడ్డా 150 కట్టలు దాటడం లేదు. రోజువారీ కూలీ కూడా గిట్టుబాటు కావడం లేదు. దినమంతా పనిచేస్తే రూ. 300 కూలీ వస్తుంది. కట్ట రేట్లు పెంచేందుకు అధికారులు కృషి చేయాలి. 

జాగ్రత్తలు తీసుకోవాలి....

లావణ్య, జిల్లా అటవీ ఇన్‌చార్జి 

తునికాకు కోసం అడవుల్లోకి వెళ్లే వారు అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు వహించాలి. ఆకులు కోసే సమయంలో వంగి ఉండవద్దు. ఆ సమయంలో పులులు జంతువులుగా భావించి దాడిచేసే ప్రమాదం ఉంది. అలాగే అడవుల్లో నీటి గుంటల వద్దకు, పొదల పక్కకు వెళ్లకుండా ఉంటే మంచిది. అడవుల్లోకి వెళ్లేసమయంలో ఒంటరిగా కాకుండా గుంపులుగా వెళితే వన్యప్రాణులు దగ్గరికి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కూలీలు తాగునీరు వెంట తీసుకెళితే దాహం తీర్చుకొనేందుకు ఇబ్బందులు పడాల్సిన అవసరం రాదు.  

 


Updated Date - 2021-05-22T03:46:19+05:30 IST