వంతెన నిర్మాణంతో తీరనున్న కష్టాలు
ABN , First Publish Date - 2021-10-29T03:37:48+05:30 IST
పీకలగూడెం వాగుపై వంతెన నిర్మాణంతో ప్రజల కష్టాలు తీరనున్నాయని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. గురువారం మండలంలోని పీకలగూడెం వంతెనను ఆయన పరిశీలించారు. వంతెన నిర్మాణంతో దహెగాం, వేమన పల్లి, కన్నెపల్లి మండలాలకు రవాణా సౌకర్యం మెరుగుపడడమే కాకుండా ప్రజలకు దూరభారం తప్పిందన్నారు. రవాణా సౌకర్యంతో మారుమూల ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు.

- ఎమ్మెల్యే కోనేరు కోనప్ప
దహెగాం, అక్టోబరు 28: పీకలగూడెం వాగుపై వంతెన నిర్మాణంతో ప్రజల కష్టాలు తీరనున్నాయని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. గురువారం మండలంలోని పీకలగూడెం వంతెనను ఆయన పరిశీలించారు. వంతెన నిర్మాణంతో దహెగాం, వేమన పల్లి, కన్నెపల్లి మండలాలకు రవాణా సౌకర్యం మెరుగుపడడమే కాకుండా ప్రజలకు దూరభారం తప్పిందన్నారు. రవాణా సౌకర్యంతో మారుమూల ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. కుంచెవెల్ల వార్డు సభ్యుడు సంజీవ్ కూతురు అనారోగ్యంతో మృతి చెందడంతో ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను పరామ ర్శించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్, ఆర్‌ఎస్‌ఎస్ కన్వీనర్ సంతోష్ గౌడ్, సర్పంచ్ భాగ్యలక్ష్మి, నాయకులు పాల్గొన్నారు.