జిల్లాలో క్రిస్మస్‌ సందడి

ABN , First Publish Date - 2021-12-25T06:11:50+05:30 IST

క్రైస్తవ సోదరులు ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే పండుగ అయిన క్రిస్మస్‌ను శనివారం ఘనంగా జరుపుకోనున్నారు. క్రిస్మస్‌ సందర్భంగా జిల్లాలో ఇప్పటికే ప్రధాన చర్చీలన్నీ అందంగా ముస్తా బ య్యాయి. ప్రధానంగా ఆదిలాబాద్‌లోని రవీంద్రనగర్‌లో గల ఈఎస్‌ఐ చర్చి

జిల్లాలో క్రిస్మస్‌ సందడి
ఎన్టీఆర్‌చౌక్‌లో క్రిస్మస్‌ వేడుకలకు ముస్తాబైన క్యాథలిక్‌ చర్చి

ముస్తాబైన చర్చీలు

విద్యుత్‌ దీపాలతో అలంకరణ

ప్రత్యేక ప్రార్థనలకు సర్వం సిద్ధం

ఆదిలాబాద్‌ టౌన్‌, డిసెంబరు 24: క్రైస్తవ సోదరులు ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే పండుగ అయిన క్రిస్మస్‌ను శనివారం ఘనంగా జరుపుకోనున్నారు.  క్రిస్మస్‌ సందర్భంగా జిల్లాలో ఇప్పటికే ప్రధాన చర్చీలన్నీ అందంగా ముస్తా బ య్యాయి. ప్రధానంగా ఆదిలాబాద్‌లోని రవీంద్రనగర్‌లో గల ఈఎస్‌ఐ చర్చి, ఎన్టీ ఆర్‌ చౌక్‌లోని క్యాథలిక్‌ చర్చి, ఖానాపూర్‌, బొక్కల్‌గూడ, సంజయ్‌నగర్‌, టైలర్స్‌ కాలనీ వంటి తదితర కాలనీల్లో చర్చిలను విద్యుత్‌ దీపాలతో అత్యంత సుం దరంగా తీర్చిదిద్దారు. పలు గ్రామాల్లో ఉన్న చర్చిలను కూడా వేడుకల కోసం ప్ర త్యేక విద్యుత్‌ కాంతులతో అలంకరించి సిద్ధం చేశారు. ఈ మేరకు క్రిస్‌మస్‌ పండుగను పురస్కరించుకుని శనివారం భారీగా తరలివచ్చే క్రైస్తవులు ప్రార్థనలు చేసుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కాగా శుక్రవారం రాత్రి నుంచి క్రిస్మస్‌ సంబరాలు ప్రారంభమయ్యాయి. క్రీస్తు అంటే రక్షకుడని, లోకాన్ని రక్షించడానికి ప్రభువైన యోహోవా తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి మానవ రూపంలో పంపిస్తాడని క్రైస్తవులు చెప్పుకుంటారు. కన్య అయిన మరియమ్మ గర్భాన పవిత్రాత్మ చేత బెత్లహంలో క్రీస్తు జన్మిస్తాడని, పశువుల తొట్టిలో జన్మించి న క్రీస్తును చూసి గొల్లలు, జ్ఞానులు ఎంతో ఆనందిస్తారు. క్రిస్మస్‌ అంటే మాస్‌ లేక చర్చిసేవ అని, రోమ్‌లో ఈ వేడుకలు ముందుగా ప్రారంభమయ్యాయని, అప్పటి నుచి డిసెంబరు 25న క్రిస్మస్‌ జరుపుకోవాలని నిర్ణయించారని వారు పేర్కొంటున్నారు. ఇందుకు గాను క్రిస్మస్‌ వేడుకలను అత్యంత భక్తిశ్రద్ధల మధ్య క్రైస్తవులు ఘనంగా జరుపుకునేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. కాగా ఉద యం వేడుకల్లో భాగంగా చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. 

Updated Date - 2021-12-25T06:11:50+05:30 IST