బాలల హక్కులను కాపాడాలి

ABN , First Publish Date - 2021-10-22T03:59:08+05:30 IST

బాలలు వేధింపులకు గురైన, కార్మికులుగా ఉన్నా, ఇతర సమస్యలున్నా చైల్డ్‌లైన్‌ను సంప్రదించాలని జిల్లా సంక్షేమ అధికారి ఉమా దేవి, చైల్డ్‌లైన్‌ జిల్లా సమన్వయకర్త సత్యనారాయణ పేర్కొన్నారు. గురువారం మెట్‌పల్లిలోని రైతువేదికలో బాలల సమస్యలు-పరిష్కారం, చట్టాలు అనే అంశా లపై నిర్వహించిన ఓపెన్‌హౌజ్‌ కార్యక్రమంలో మాట్లాడారు.

బాలల హక్కులను కాపాడాలి
మాట్లాడుతున్న జిల్లా సంక్షేమ అధికారి ఉమాదేవి

కన్నెపల్లి, అక్టోబరు 21: బాలలు వేధింపులకు గురైన, కార్మికులుగా ఉన్నా, ఇతర సమస్యలున్నా చైల్డ్‌లైన్‌ను సంప్రదించాలని జిల్లా సంక్షేమ అధికారి ఉమా దేవి, చైల్డ్‌లైన్‌ జిల్లా సమన్వయకర్త సత్యనారాయణ పేర్కొన్నారు. గురువారం మెట్‌పల్లిలోని రైతువేదికలో బాలల సమస్యలు-పరిష్కారం, చట్టాలు అనే అంశా లపై నిర్వహించిన ఓపెన్‌హౌజ్‌ కార్యక్రమంలో మాట్లాడారు. బాలల సంరక్షణకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయని, వాటిని తెలుసుకుని బాలల హక్కులను కాపాడా లని పేర్కొన్నారు. సమస్యలుంటే 1098కి కాల్‌ చేయాలన్నారు. చైల్డ్‌లైన్‌ డైరెక్టర్‌ జీజో ఆంటోని, ఉపాధ్యాయులు రమేష్‌, ప్రభాకర్‌, సర్పంచులు లక్ష్మీహంస, కార్యదర్శి ఉష, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ రమాదేవి పాల్గొన్నారు.  

Updated Date - 2021-10-22T03:59:08+05:30 IST