చమురు ధరల నియంత్రణలో కేంద్రం విఫలం: కాంగ్రెస్‌

ABN , First Publish Date - 2021-10-19T06:41:59+05:30 IST

రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలను నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని యువజన కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు బర్రె నరేష్‌ అన్నారు.

చమురు ధరల నియంత్రణలో కేంద్రం విఫలం: కాంగ్రెస్‌
భువనగిరిలో తాడుతో ఆటోను లాగుతూ నిరసన తెలుపుతున్న యువజన కాంగ్రెస్‌ కార్యకర్తలు

భువనగిరిటౌన్‌, సెప్టెంబరు 18: రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలను నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని యువజన కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు బర్రె నరేష్‌ అన్నారు. ఈ మేరకు భువనగిరిలో  సోమవారం  ఆటోను తాడుతో లాగుతూ నిరసన తెలి పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పెరుగుతున్న ఇంధనం ధరలు అన్ని వస్తువుల ధరలపై ప్రభావం చూపుతున్నా కేంద్రం స్పందిం చడం లేదని ఆయన అన్నారు. ఈ  కార్యక్రమంలో నాయకులు పడిగెల ప్రదీప్‌, ఎనగండ్ల సుధాకర్‌, మనోజ్‌, కాకునూరి మహేందర్‌, కొల్లూరి రాజు, ఎండి ఫయాజ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-19T06:41:59+05:30 IST