బీజేపీ నాయకుల సంబరాలు

ABN , First Publish Date - 2021-11-03T04:09:55+05:30 IST

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ విజయం సాధించడంతో జిల్లా వ్యాప్తంగా మంగ ళవారం ఆ పార్టీ నాయకులు సంబరాలు చేసుకు న్నారు.

బీజేపీ నాయకుల సంబరాలు
ఆసిఫాబాద్‌లో స్వీట్లు పంపిణీ చేస్తున్న బీజేపీ నాయకులు

ఆసిఫాబాద్‌/రెబ్బెన/కాగజ్‌నగర్‌ టౌన్‌/లింగాపూర్‌/చింతలమానే పల్లి/బెజ్జూరు/సిర్పూర్‌(టి) నవంబరు 2: హుజూరాబాద్‌ ఉప ఎన్నిక లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ విజయం సాధించడంతో జిల్లా వ్యాప్తంగా మంగ ళవారం ఆ పార్టీ నాయకులు సంబరాలు చేసుకు న్నారు. ఆసిఫాబాద్‌ పట్టణంలో బీజేపీ నాయకులు  పార్టీ కార్యాల యం నుంచి విజయోత్సవ ర్యాలీ నిర్వహించి బాణసంచా కాల్చారు.  కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు జేబీ పౌడెల్‌ నాయకులు సతీష్‌బాబు, సుహాసిని, విశాల్‌, వందన, గణేష్‌ తదితరులు పాల్గొన్నారు.  రెబ్బెన మండల కేంద్రంలో మిఠాయిలు పంపిణీ చేశారు.  కార్యక్రమంలో బీజే పీ జిల్లా అధ్యక్షుడు జేబీ పౌడెల్‌, నాయకులు ఆత్మారాం, కిరణ్‌కు మార్‌, తిరుపతి, చక్రపాణి, బాలకృష్ణ, రాంబాబు, ఆంజనేయులుగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. కాగజ్‌నగర్‌లో బీజేపీ నాయకులు విజయోత్సవ సంబరాలు చేసుకున్నారు. పార్టీ కార్యాలయంతో పాటు ఎన్టీఆర్‌ చౌక్‌, రాజీవ్‌ గాందీ చౌరస్తాల్లో బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. స్వీట్లు పంపిణీ చేశారు.  కార్యక్రమంలో బీజేపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్‌ కొత్తపల్లి శ్రీనివాస్‌, జిల్లా కార్యదర్శి కొంగ సత్యనారాయణ, కన్వీనర్‌ వీరభద్రాచారి, పార్టీ కాగజ్‌నగర్‌, దహెగాం, పెంచికల్‌పేట మండలాల అధ్యక్షులు గోలెం వెంకటేశ్‌, సురేష్‌, భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు. లింగాపూర్‌ మండలంలో బీజేపీ నా యకులు టపాసులు కాల్చి విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు.  కార్యక్రమంలో రమేష్‌, చంద్రభాన్‌, శ్రీకాంత్‌చారి తదితరులు పాల్గొ న్నారు. చింతలమానేపల్లి మండలంలో బీజేపీ నాయకులు విజయో త్సవ సంబరాలు నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీశైలం, తదితరులు పాల్గొన్నారు.  బెజ్జూరులో బీజేపీ నాయకులు బాణసంచా కాల్చి, మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బాలకృష్ణ, లింగయ్య, శ్యాంసుందర్‌, తిరుపతి పాల్గొన్నారు. సిర్పూర్‌(టి)లో బీజేపీ నాయ కు లు సంబరాలు జరుపుకున్నారు. వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-03T04:09:55+05:30 IST