పట్టణ టీఆర్‌ఎస్‌లో గడబిడ

ABN , First Publish Date - 2021-05-02T06:26:32+05:30 IST

ఆదిలాబాద్‌ పట్టణ టీఆర్‌ఎస్‌లో మరోసారి నేతల మధ్య విభేధాలు బయట పడ్డాయి. పెళ్లి రోజు విందులో ఓ వ ర్గం నేతలు పాల్గొనడం, మరో వర్గానికి ఆగ్రహం తెప్పించింది. కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న ఆదిలాబాద్‌ మండల మాజీ వైస్‌ చైర్మన్‌ గంగారెడ్డి పేరిటా మే డే సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎమ్మెల్యే జోగురామన్న ఫొటోను పెట్టకపోవడం వివాదానికి కారణమైంది.

పట్టణ టీఆర్‌ఎస్‌లో గడబిడ

రెండు వర్గాల మధ్య పోటాపోటీ

ఆదిలాబాద్‌, మే1 (ఆంధ్రజ్యోతి) : ఆదిలాబాద్‌ పట్టణ టీఆర్‌ఎస్‌లో మరోసారి నేతల మధ్య విభేధాలు బయట పడ్డాయి. పెళ్లి రోజు విందులో ఓ వ ర్గం నేతలు పాల్గొనడం, మరో వర్గానికి ఆగ్రహం తెప్పించింది. కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న ఆదిలాబాద్‌ మండల మాజీ వైస్‌ చైర్మన్‌ గంగారెడ్డి పేరిటా మే డే సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎమ్మెల్యే జోగురామన్న ఫొటోను పెట్టకపోవడం వివాదానికి కారణమైంది. మళ్లీ వెంటనే ఎమ్మెల్యే ఫొటోతో మరో ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం ఈ రెండు ఫ్లెక్సీలను సోషల్‌ మీడియాలో పోస్టులు చేయడంతో వైరల్‌ అవుతున్నాయి. విందు పార్టీలో టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు కలిసి పాల్గొనడం విశేషం.


Updated Date - 2021-05-02T06:26:32+05:30 IST