కమ్మేసిన పొగమంచు

ABN , First Publish Date - 2021-12-29T04:09:57+05:30 IST

ఆసిఫాబాద్‌ జిల్లాలో పలుచొట్ట మంగళవారం ఉదయం పొగమంచు కమ్ముకుంది. తెల్లవారు జాము నుంచి ఉదయం 10 గంటల వరకు కూడా పొగమంచు కమ్మేయడంతో వాహనదారుల రాక పోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆకాశం మేఘా వృతమై పూర్తిగా పొగమంచు కమ్ముకు పోవడంతో ఇబ్బందులు పడ్డారు.

కమ్మేసిన పొగమంచు
ఆసిఫాబాద్‌లో కమ్ముకున్న పొగమంచు

- రాకపోకలకు వాహనదారుల ఇబ్బందులు
ఆసిఫాబాద్‌/కాగజ్‌నగర్‌/వాంకిడి/దహెగాం, డిసెంబరు 28: ఆసిఫాబాద్‌ జిల్లాలో పలుచొట్ట మంగళవారం ఉదయం పొగమంచు కమ్ముకుంది. తెల్లవారు జాము నుంచి ఉదయం 10 గంటల వరకు కూడా పొగమంచు కమ్మేయడంతో వాహనదారుల రాక పోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆకాశం మేఘా వృతమై పూర్తిగా పొగమంచు కమ్ముకు పోవడంతో ఇబ్బందులు పడ్డారు. దహెగాంలో సైతం తవ్రమైన పొగమంచు కమ్ముకుంది. కాగజ్‌నగర్‌ పట్టణంలో  తెల్లవారుజాము నుంచి పొగ మంచు తగ్గకపోవడంతో స్థానిక రైల్వే స్టేషన్‌, ఆర్‌ఓబీ, మార్కెట్‌ ఏరియా, పెట్రోల్‌ పంపు తదితర ప్రాంతాల్లో ప్రజలు రాకపోకలకు తీవ్ర అవస్థలు పడ్డారు. రైల్వే ట్రాక్‌పై పొగమంచుతో కప్పేసింది. రెండు రోజులుగా చల్లని వాతావరణానికి తోడు రాత్రి పూట ఎక్కు వగా మంచు కురుస్తోంది. ఉదయం 10 గంటలు దాటాక ఎండ రావడంతో పొగ మంచు తొలగిపోయింది. వాంకిడి మండలంలో మంగళవారం ఉదయం  8 గంట ల వరకు తీవ్రమైన పొగమంచు కమ్ముకుంది. దీంతో వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు.  

Updated Date - 2021-12-29T04:09:57+05:30 IST