పశువులకు బ్రూసెల్లో వ్యాధి నివారణ టీకాలు

ABN , First Publish Date - 2021-08-21T05:51:36+05:30 IST

జిల్లా కేంద్రంలోని సిద్దాపూర్‌ కాలనీలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో బ్రూసెల్లో వ్యాధి నివారణ టీకాలను శుక్రవారం పం పిణీ చేశారు.

పశువులకు బ్రూసెల్లో వ్యాధి నివారణ టీకాలు


నిర్మల్‌, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని సిద్దాపూర్‌ కాలనీలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో బ్రూసెల్లో వ్యాధి నివారణ టీకాలను శుక్రవారం పం పిణీ చేశారు. ఈ సందర్భంగా పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ డి.పద్మ మా ట్లాడుతూ... బ్రూసెల్లో వ్యాధి వలన పశువుల్లో అబార్షన్లు అవుతున్నాయన్నారు. ఈ వ్యాధి పశువుల నుంచి మనుషులకు కూడా సోకుతుందన్నారు. 4 నుంచి 8 నెలల వయస్సు గల ఆడ పశువులకు టీకాలను వేస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని పశు పోషకులు సద్వినియోగపర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్‌ కరుణాకర్‌, సిబ్బంది మణి కుమార్‌, వార్డు మెంబర్‌ పి.శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-21T05:51:36+05:30 IST