పంటల కొనుగోలును సీఎం దృష్టికి తీసుకెళ్తా : ఎమ్మెల్యే
ABN , First Publish Date - 2021-01-13T05:14:39+05:30 IST
రైతులు పండించిన పంటలను కొనుగోలు చేసే విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్‌బాపురావు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని గోదామును తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతు ల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టారన్నారు. టీఆర్‌ఎస్ మం డల కన్వీనర్ ఎల్మ శ్రీనివా్‌సరెడ్డి, ఉపాధ్యక్షుడు తోట వెంకటేశ్, మహిళా అ ధ్యక్షురాలు కాటిపెల్లి సునితారెడ్డి పాల్గొన్నారు.

తలమడుగు/గుడిహత్నూర్/ఇచ్చోడ, జనవరి 12: రైతులు పండించిన పంటలను కొనుగోలు చేసే విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్‌బాపురావు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని గోదామును తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతు ల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టారన్నారు. టీఆర్‌ఎస్ మం డల కన్వీనర్ ఎల్మ శ్రీనివా్‌సరెడ్డి, ఉపాధ్యక్షుడు తోట వెంకటేశ్, మహిళా అ ధ్యక్షురాలు కాటిపెల్లి సునితారెడ్డి పాల్గొన్నారు. మండల కేంద్రానికి చెందిన ఏలుగు సంజీవ్ తమ్ముడు ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబ స భ్యులను పరామర్శించారు. గుడిహత్నూర్ మండలం మన్నూర్ గురుజ గ్రా మాల బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఎంపీపీ రాథోడ్‌పుండలిక్, కో-ఆప్షన్ సభ్యుడు షేక్ జమీర్, టీఆర్‌ఎస్ ఉమ్మడి జిల్లా కోశాధికారి బూర్లలక్ష్మీనారాయణ, మండల అధ్యక్షుడు కరాడ్ బ్రహ్మనంద్, తుడందెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెందూర్ జలపతి పాల్గొన్నారు. వెల్మ భూ మారెడ్డి అనారోగ్యంతో మృతి చెందగా, కుటుంబీకులను పరామర్శించారు.