లాటరీ పద్ధతిలో బ్రాందీషాపులు : కలెక్టర్‌

ABN , First Publish Date - 2021-11-09T05:31:25+05:30 IST

ప్రభుత్వ ఆదేశాల మేరకు లాటరీ పద్ధతిన బ్రాందీషాపులు (ఏ4 దుకాణాలు) కేటాయింపు ప్రక్రియ నిర్వహించడం జరిగిందని కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ తెలిపారు. సోమవారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో బ్రాంది షాపుల కేటాయింపు లాటరీ పద్ధతిని సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌, ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ 40 దుకాణాలను కేటాయించారు.

లాటరీ పద్ధతిలో బ్రాందీషాపులు : కలెక్టర్‌

ఆదిలాబాద్‌ టౌన్‌, నవంబరు 8: ప్రభుత్వ ఆదేశాల మేరకు లాటరీ పద్ధతిన బ్రాందీషాపులు (ఏ4 దుకాణాలు) కేటాయింపు ప్రక్రియ నిర్వహించడం జరిగిందని కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ తెలిపారు. సోమవారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో బ్రాంది షాపుల కేటాయింపు లాటరీ పద్ధతిని సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా  కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌, ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ 40 దుకాణాలను కేటాయించారు. ఇందులో వారి ఆదేశాల ప్రకాజిల్లాలో 25 దుకాణాలు ఓపెన్‌ కాంపిటేషన్‌, 9దుకాణాలు షెడ్యుల్డు తెగల వారికి, 5 దుకాణాలు షెడ్యుల్డు కులాల వారికి, ఒక దుకాణం గౌడ కులస్థులకు కేటాయించామని తెలిపారు. ఇందులో జిల్లా ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ అధికారి ఎస్‌.రవీందర్‌రాజు, జిల్లా షెడ్యుల్డు కులాల అభివృద్ధి అధికారిని సునిత, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి రాజలింగం, సహాయ గిరిజన సంక్షేమాధికారి ప్రణయ్‌, సీఐ సీహెచ్‌ శ్రీనివాస్‌, ఉట్నూర్‌ సీఐ మంగమ్మ, ఎస్సై అరుణ్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

ఫిర్యాదులు పరిశీలించి చర్యలు తీసుకుంటా

జిల్లాలో ప్రజల విజ్ఞప్తులను పరిశీలించి వారి సమస్యలపై సంబంధిత శాఖల ద్వారా చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో అర్జీదారుల నుంచి వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించారు. ఇందులో అదనపు కలెక్టర్‌ నటరాజ్‌, ఆర్డీవో రాజేశ్వర్‌, జడ్పీ సీఈవో గణపతి, తదితరులున్నారు.

Updated Date - 2021-11-09T05:31:25+05:30 IST