కన్నుల పండువగా బ్రహ్మోత్సవాలు

ABN , First Publish Date - 2021-02-26T05:51:36+05:30 IST

మండలంలోని పిప్పల్‌కోటి గుట్టపై ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా జరిగాయి. అలివెలు మంగమ్మ శ్రీలక్ష్మి వేంకటేశ్వర కల్యాణం వైభవంగా నిర్వహించారు.

కన్నుల పండువగా బ్రహ్మోత్సవాలు
పిప్పల్‌కోటిలో స్వామి వారి కల్యాణ మహోత్సవానికి హాజరైన భక్తులు

భీంపూర్‌, ఫిబ్రవరి 25: మండలంలోని పిప్పల్‌కోటి గుట్టపై ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా జరిగాయి. అలివెలు మంగమ్మ శ్రీలక్ష్మి వేంకటేశ్వర కల్యాణం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపూరావు సతీసమేతంగా వచ్చి పూజలు నిర్వహించారు. ముందుగా వేద పండితులు హోమం, యజ్ఞం నిర్వహించారు. అనంతరం మహా అన్నదానం చేశారు. సాయంత్రం పల్లికి శోభాయాత్రతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి రామచంద్రారెడ్డి, టీటీడీ పాలక వర్గ సభ్యుడు బెజ్జంకి అనిల్‌కుమార్‌, వైస్‌ ఎంపీపీ గడ్డం లస్మన్న, స్థానిక సర్పంచ్‌ కేమ కళ్యాణి, గోపాలకృష్ణ మఠాధిపతి యోగానంద సరస్వతి, పూజారి పరమేశ్వర అయ్యా తదితరులు పాల్గొన్నారు. కాగా, పిప్పల్‌కోటి గ్రామంలో స్థానికంగా ఉండే ముస్లింలు అన్నదానం కోసం వంటలు వండడం విశేషం.


Updated Date - 2021-02-26T05:51:36+05:30 IST