పూసాయి ఎల్లమ్మ తల్లికి బోనాల సమర్పణ

ABN , First Publish Date - 2021-01-14T04:58:53+05:30 IST

మండలంలోని అతిపెద్ద జాతరగా పేరుగాంచిన పూసాయి ఎల్లమ్మ(దుర్గామాత) ఆలయంలో బుధవారం పూసాయి గ్రామస్థులు, మహిళలు ఎల్లమ్మ తల్లికి డప్పులు, భాజాల మధ్య నైవేద్యాలు సమర్పించారు. పుష్యమాసం ప్రారంభం నుంచి వచ్చే మాగ మాసం వరకు ఈ జాతర కొనసాగనుంది.

పూసాయి ఎల్లమ్మ తల్లికి బోనాల సమర్పణ
మట్టి కుండలలో బోనాలను తీసుకు వెళ్తున్న మహిళలు

జైనథ్‌, జనవరి 13: మండలంలోని అతిపెద్ద జాతరగా పేరుగాంచిన పూసాయి ఎల్లమ్మ(దుర్గామాత) ఆలయంలో బుధవారం పూసాయి గ్రామస్థులు, మహిళలు ఎల్లమ్మ తల్లికి డప్పులు, భాజాల మధ్య నైవేద్యాలు సమర్పించారు. పుష్యమాసం ప్రారంభం నుంచి వచ్చే మాగ మాసం వరకు ఈ జాతర కొనసాగనుంది. జాతర మొదటి రోజున అనవాయితీగా పూసాయివాసులు, మహిళలు ఎల్లమ్మతల్లికి నైవేద్యాలు వండి మట్టి కుండలలో బోనాలను నెత్తిన పెట్టుకొని తరలివచ్చారు. ఎల్లమ్మతల్లి ఆలయానికి చేరుకున్న మహిళలు బోనాలను సమర్పించా రు. ఈ సందర్భంగా ఎల్లమ్మతల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజలు పాడి పంటలతో  సల్లంగా ఉండాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో  సర్పంచ్‌ పోతరెడ్డి, వీడీసీ అధ్యక్షుడు బుర్రి చిన్నయ్య, అర్చకుడు సురే్‌షలతో పాటు గ్రామస్థులు, మహిళలు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-14T04:58:53+05:30 IST