రక్తదానం ప్రాణదానంతో సమానం
ABN , First Publish Date - 2021-05-09T03:53:01+05:30 IST
రక్తదా నం ప్రాణదానంతో సమానమని, కరోనా కాలంలో తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం రక్తదానం చేయ డానికి వచ్చిన వారంతా గొప్ప సేవ లకుని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెర బెల్లి రఘునాథ్‌రావు అన్నారు. శని వారం ఇందుగార్డెన్‌లో బీజేవైఎం ఆధ్వర్యంలో తలసేమియా సికిల్ సెల్ వ్యాధిగ్రస్తుల కోసం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు.

మందమర్రిటౌన్, మే 8 : రక్తదా నం ప్రాణదానంతో సమానమని, కరోనా కాలంలో తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం రక్తదానం చేయ డానికి వచ్చిన వారంతా గొప్ప సేవ లకుని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెర బెల్లి రఘునాథ్‌రావు అన్నారు. శని వారం ఇందుగార్డెన్‌లో బీజేవైఎం ఆధ్వర్యంలో తలసేమియా సికిల్ సెల్ వ్యాధిగ్రస్తుల కోసం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసు కోకపోవడం దారుణమన్నారు. బ్లడ్‌బ్యాంకులో రక్తం నిల్వ లు తగ్గిపోతున్నాయని, దీని వల్ల తలసేమియా సికిల్‌సెల్ వ్యాధిగ్రస్తులకు ప్రాణాపాయం ఏర్పడే అవకాశం ఉం దన్నారు. రక్తదానం చేసిన వారికి ప్రశంసాపత్రాలు అం దించారు. బీజేవైఎం అధ్యక్షుడు వెంకటకృష్ణ, శ్రీనివాస్, శంకర్, నర్సింగ్ పాల్గొన్నారు.
లక్షణాలున్న వారందరికి పరీక్షలు చేయాలి
హాజీపూర్: కరోనా లక్షణాలున్న ప్రతీ ఒక్కరికి కరోనా పరీక్షలు నిర్వహించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్‌రావు అన్నారు. పీహెచ్‌సీని శనివారం సందర్శిం చారు. ఆయన మాట్లాడుతూ ఆసుపత్రిలో కొవిడ్ టెస్టింగ్ కిట్ల కొరతతో రోజుకు 25 మందికి మాత్రమే టెస్టులు చేసి మిగతా వారిని వెనక్కి పంపిస్తున్నారన్నారు. టెస్టుల కోసం వచ్చిన వారికి ఐదు రోజులకు సరిపడా మందులు ఇచ్చి తగ్గకపోతే టెస్టులు చేస్తున్నారన్నారు. ఆ వ్యక్తికి పాజిటివ్ ఉంటే 5 రోజుల్లో సీరియస్ అయ్యే ప్రమాదం ఉందన్నారు. వచ్చిన ప్రతీ ఒక్కరికి టెస్టులు చేయాలని డిమాండ్ చేశా రు. మండల అధ్యక్షుడు బొలిశెట్టి తిరుపతి, నాయకులు వెంకట రమణరావు, సత్యం, బొడ్డు తిరుపతి, హనుమాండ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.