పాఠశాలలకు వరం విద్యాంజలి

ABN , First Publish Date - 2021-12-05T05:41:28+05:30 IST

కేంద్రప్రభుత్వం ప్రజల, స్వచ్చంద సంస్థల భాగస్వామ్యంతో పాఠశాలల అభివృద్ధి కోసం చేపట్టిన వినూత్న పథకం విద్యాంజలి 2.0 కేంద్ర మాన వవనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో విద్యాంజలి రూపొం దించారు.

పాఠశాలలకు వరం విద్యాంజలి
తరగతిగదిలో పాఠాలు వింటున్న విద్యార్థులు (ఫైల్‌

కేంద్ర ప్రభుత్వ వినూత్న పథకం

ప్రజల భాగస్వామ్యంతో వనరుల కూర్పు

ప్రత్యేక వె బ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌ 

జిల్లాలో 652 పాఠశాలల నమోదు

నిర్మల్‌కల్చరల్‌, డిసెంబరు 4 : కేంద్రప్రభుత్వం ప్రజల, స్వచ్చంద సంస్థల భాగస్వామ్యంతో పాఠశాలల అభివృద్ధి కోసం చేపట్టిన వినూత్న పథకం విద్యాంజలి 2.0 కేంద్ర మాన వవనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో విద్యాంజలి రూపొం దించారు. ప్రధాని నరేంద్రమోడీ ఈ పథకాన్ని 2016 జూన్‌ నెలలో ప్రారంభించారు. పాఠశాలల్లో మౌలిక వనరులను సమకూర్చడం ప్రధాన ఉద్దేశ్యం, విద్యార్థుల్లో మానసిక వికాసానికి దోహదం చేసే సరికొత్త పథకం. వీటితో పాటు మరుగుదొడ్ల నిర్మాణం, మూత్రశాలలు, వంట శాలలు, తరగతి గదులు, ప్రహరీ నిర్మాణాలు, తదితర వాటిని చేపడ తారు. ఈ ఇబ్బందులు విద్యార్థులు ఎదుర్కోకుండా ఉండేందుకు విద్యాం జలి దోహదం చేస్తుంది. 

ప్రజలు, సంస్థల భాగస్వామ్యం

పాఠశాలల అభివృద్ధిలో ప్రజలు, స్వచ్చందసంస్థలు భాగస్వామ్యం కల్పించేందుకు విద్యాంజలి వేదిక కానుంది. వ్యవస్థీకృత వ్యవస్థ ఏర్పాటు చేసి వనరులు కల్పిస్తారు. నాణ్యమైన విద్యాబోధన లక్ష్యం సాధించా లం టే మౌలిక వసతుల కల్పన ఆవశ్యంగా భావించి పథక రూపకల్పన జరి గింది. ఈ పథకం అమలయ్యేందుకు రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ పర్యవేక్షిస్తోంది. చదువుతో పాటు విద్యార్థులకు ఇతర అంశా లపై పూర్తి పట్టు సాధించడం, జీవితాల్లో మరింత ముందుకు సాగేలా ఈ పథకం ప్రోత్సహిస్తోంది. వారిలో మనోధైర్యాన్ని కల్పించనుంది. వివిధ రంగాల్లో విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందినవారు స్వచ్ఛంద సంస్థల ప్రావీణ్యులు తమ ప్రతిభ ఇతరులకు పంచేందుకు ఉపకరి స్తుంది.

నమోదు చేసుకునే విధానం

ఆయా ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాల ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాలలోని అవసరాల వివరాలు ఆన్‌లైన్‌ ద్వారా విద్యాంజలి 2.0 పోర్టల్‌లో నమోదు చేయాలి. వారి గ్రామాలు, మండలాలు, జిల్లాలోని దాతలు, స్వచ్ఛంద సంస్థలను గుర్తించాలి. వారు ఎలాంటి సహకారం అందించ గలరో కూడా పోర్టల్‌లో నమోదు చేయా లి. విద్యాశాఖ దానికనుగుణంగా ఆయా సంస్థలతో సమావేశం ఏర్పాటు చేసి పాఠశాల అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేలా చేస్తారు. 

ఎవరెవరు సేవలందించవచ్చు

విద్యాభారతి 2.0 పోర్టల్‌లో ముందుగా నమోదు చేసుకోవాలి. భారత దేశపౌరులు, ప్రవాస భారతీయులు, బోధనపై ఆసక్తి ఉన్నవారు స్వచ్ఛం ద సంస్థల బాధ్యులు, విరమణ చేసిన ఉపాధ్యాయులు ఉద్యోగులు సేవ చేసే అవకాశం కల్పిస్తుంది. అకడమిక్‌ విషయాలపై అవగాహన, ఇంగ్లీష్‌, గణితం, హిందీ, విజ్ఞాన, సాంఘికశాస్త్రం జీవన నైపుణ్యాలు మెరుగు పరిచేలా సహాయ సహకారాలు అందించవచ్చు. పదవీ విరమణ చేసిన సైనికులు, వివిధ సంస్థలు, కంపెనీలు, గ్రూపులు రిజిస్టర్‌ కావచ్చు. 

ఎలాంటి వనరులు కల్పించాలి

ఆయా గ్రామాల్లోని పాఠశాల ప్రధానోపాధ్యాయులు పోర్టల్‌లో తమ సమస్యలు నమోదు చేయాలి. పాఠశాలలో భౌతిక వనరులు, భవన ని ర్మాణం, ప్రహరీగోడ, విద్యుత్‌సౌకర్యం, తరగతి గది అవసరాలు, డిజిటల్‌ ఇన్ర్ఫాస్ట్రక్చర్‌, కో కరిక్యులర్‌ యాక్టివిటీస్‌, స్పోర్ట్స్‌సామాగ్రి, ఆరోగ్య పరిరక్షణ కిట్లు, బోధన సామాగ్రి, కార్యాలయ అవసరాలు నెరవేర్చడం, పాఠశాల మరమ్మతులు, తదితర అవసరాలు తీర్చవచ్చు.

జిల్లాలో 652 స్కూల్స్‌ నమోదు

విద్యాంజలి 2.0 పథకానికి జిల్లాలో 652 పాఠశాల లు ఇప్పటి వరకు నమోదయ్యాయి. మొత్తం 799 పాఠశాలలున్నాయి. 81.6 శాతం నమో దు పూర్తయి స్థానిక సంస్థలు, ప్రభుత్వ, కేజీబీవీ, ఆదర్శ పాఠశాలలు నమోదైన వాటిలో ఉన్నాయి. బోధనపై ఆసక్తి ఉన్నవారికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సేవచేసే అవకాశం ఈ పథకంలో ఉంది.

- నాగుల రవి ( విద్యాంజలి సమన్వయ కర్త)

విద్యాంజలి బృహత్తర పథకం

కేంద్రప్రభుత్వం రూపొందించిన విద్యాంజలి ఒక బృహత్తరపథకం. ప్రభుత్వ పాఠశాలలకు స్వచ్ఛం దంగా సేవ చేసే అవకాశం విద్యాంజలి కల్పిస్తోంది. పాఠశాలల్లో మౌలిక సౌకర్యాలు కల్పించడం, విద్యా ర్థులకు విద్యాబోధన చేసి వారిని అన్నిరంగాల్లో తీర్చిదిద్దే వీలుంటుంది. ప్రత్యక్షంగా గానీ ఆన్‌లైన్‌ ద్వారా గానీ సేవ చే యవచ్చు. పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయులు, స్వచ్ఛందసంస్థలు, ఇతర రంగాల్లోని ప్రముఖులు విద్యాంజలి పోర్టల్‌లో నమోదు చేసు కోవాలి. జిల్లాలో వెనుకబడ్డ ప్రాంతాల్లో విద్యాభివృద్ధిలో భాగస్వాములు కావాలి. గ్రామాల్లో యూత్‌ స్వచ్ఛంద సంస్థలు, చారిటబుల్‌ ట్రస్టులకు విద్యాంజలిపై అవగాహన కల్పించి భాగస్వాములు అయ్యేందకు ప్రధానో పాధ్యాయులు ప్రోత్సహించాలి. 

- రవీందర్‌రెడ్డి, డీఈవో

Updated Date - 2021-12-05T05:41:28+05:30 IST