జిల్లా వ్యాప్తంగా బీజేపీ నాయకుల నిరసనలు

ABN , First Publish Date - 2021-05-06T04:09:50+05:30 IST

బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో బీజేపీ నాయకులు నిరసన వ్యక్తంచేశారు.

జిల్లా వ్యాప్తంగా బీజేపీ నాయకుల నిరసనలు
ఆసిఫాబాద్‌లో నిరసన వ్యక్తం చేస్తున్న బీజేపీ నాయకులు

ఆసిఫాబాద్‌, మే 5: బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో బీజేపీ నాయకులు నిరసన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్రకార్యవర్గ సభ్యుడు బోనగిరి సతీష్‌బాబు మాట్లాడుతూ పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలో టీఎంసీ అధికారంలోకి రావడంతో బీజేపీ నాయకులు, కార్యకర్తలపై దాడిచేసి హత్యలు చేస్తు న్నారని అన్నారు. దీనినితీవ్రంగా ఖండిస్తున్నామ న్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కాండ్రె విశాల్‌, నాయకులు శ్రావణ్‌గౌడ్‌, సత్యం, లక్ష్మణ్‌, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

రెబ్బెన: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం రెబ్బెన మండల కేంద్రంలో బీజేపీ నాయకులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు జేబీపౌడెల్‌ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో గెలిచిన తరువాత ఒక్కొక్కరి సంగతి చెప్తానని బెదిరించడం సమంజసం కాదన్నారు. బీజేపీ నాయకులపై దాడిచేసిన టీఎంసీ నాయకులను వెంటనే శిక్షించాలని డిమాండ్‌ చేశారు. నాయకులు చక్రపాణి, ప్రకాష్‌, శ్రీశైలం, శేఖర్‌, రాజేష్‌, మహేందర్‌ పాల్గొన్నారు.  

చింతలమానేపల్లి: మండలకేంద్రంలో బుధ వారం బీజేపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండలాధ్యక్షుడు శ్రీశైలం మాట్లాడుతూ టీఎంసీ నాయకుల దాడులను నిర సిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఇచ్చిన పిలుపు మేరకు నిరసన తెలియజేస్తున్నట్లు పేర్కొ న్నారు. కార్యక్రమంలో నాయకులు తిరుపతిగౌడ్‌, పోషన్న, సౌమ్య, శశికల, శంకర్‌ పాల్గొన్నారు. 

దహెగాం: మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు పశ్చిమ బెంగాల్‌లో జరిగిన సంఘటనను నిరసిస్తూ నిరసన వ్యక్తం చేశారు. నాయకులు సురేష్‌, నారాయణ, మల్లేష్‌, నాగేంద్ర, నీలేష్‌, శ్రీహరి పాల్గొన్నారు.

వాంకిడి: పశ్చిమబెంగాల్‌లో టీఎంసీ గుండాలు బీజేపీ కార్యకర్తలపై దాడులుచేసి హత్య చేయడంపై మమతా బెనర్జీ క్షమపాణ చెప్పాలని బీజేపీ మండల అధ్యక్షుడు రామగిరి శ్రావణ్‌ డిమాండ్‌ చేశారు. టీఎంసీ గుండాల దాడులను నిరసిస్తూ బుధవారం నాగ్‌పూర్‌-హైదరాబాద్‌ అంతర్రాష్ట్ర రహదారిపై నల్లబ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో బీజేపీ యువమోర్చా జిల్లా అధ్యక్షుడు ఎలగతి సుచిత్‌, నాయకులు పాల్గొన్నారు.

కాగజ్‌నగర్‌ టౌన్‌: పశ్చిమబెంగాల్‌లో బీజేపీ కార్యకర్తలపై దాడి చేయడం హేయమైన చర్య అని ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు గోలెం వెంకటేశం అన్నారు. బుధవారం స్థానిక బీఎంఎస్‌ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 20మంది బీజేపీ కార్యకర్తల మృతికి టీఎంసీ కార్యకర్తలు, నాయకులు కారణమని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. నాయకులు దిలీప్‌, డోంగ్రి అరుణ్‌, చేరాల శ్రీనివాస్‌, రమేష్‌, ప్రశాంత్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-05-06T04:09:50+05:30 IST