అదనపు గదుల నిర్మాణానికి భూమి పూజ

ABN , First Publish Date - 2021-05-19T03:43:33+05:30 IST

మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ పాఠశాల ఆవరణలో ఉర్దు మీడియం ఏర్పాటు కోసం డీఎంఎఫ్‌టీ రూ.30 లక్షల వ్యయంతో అదనపు గదుల నిర్మాణానికి మంగళవారం జడ్పీ వైస్‌చైర్మన్‌ కోనేరు కృష్ణారావు భూమి పూజ చేశారు

అదనపు గదుల నిర్మాణానికి భూమి పూజ
అదనపు గదుల నిర్మాణానికి భూమి పూజ చేస్తున్న జడ్పీ వైస్‌ చైర్మన్‌ కోనేరు కృష్ణారావు

సిర్పూర్‌(టి), మే 18: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ పాఠశాల ఆవరణలో ఉర్దు మీడియం ఏర్పాటు కోసం డీఎంఎఫ్‌టీ రూ.30 లక్షల వ్యయంతో అదనపు గదుల నిర్మాణానికి మంగళవారం జడ్పీ వైస్‌చైర్మన్‌ కోనేరు కృష్ణారావు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలు పునఃప్రారంభమయ్యే వరకు పనులు పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీ కో ఆప్షన్‌ సభ్యుడు సిద్దిక్‌ అహ్మద్‌, మండల కో ఆప్షన్‌ సభ్యుడు కీజర్‌ హుస్సెన్‌, ఎంపీటీసీ సోహెల్‌ అహ్మద్‌, ఉప సర్పంచ్‌ మహేష్‌, నాయకులు ఉమాజీ, వార్డు సభ్యులు మోహీజ్‌, కిశోర్‌, పంచాయతీ రాజ్‌ ఏఈ రాజ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-19T03:43:33+05:30 IST