ఉట్నూర్‌లో ‘బేటీ బచావో.. బేటీ పడావో’
ABN , First Publish Date - 2021-03-08T05:43:26+05:30 IST
జిల్లా పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలోని తెలంగాణ సాంస్కృతిక సారథి ఆత్రం గోవింద్రావు ఆధ్వర్యంలో ఆదివారం ఉట్నూర్ వారసంతలో బేటీ బచావో.. బేటీ పఢావో కళాప్రదర్శన నిర్వహించారు.
ఉట్నూర్‌రూరల్, మార్చి 7: జిల్లా పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలోని తెలంగాణ సాంస్కృతిక సారథి ఆత్రం గోవింద్రావు ఆధ్వర్యంలో ఆదివారం ఉట్నూర్ వారసంతలో బేటీ బచావో.. బేటీ పఢావో కళాప్రదర్శన నిర్వహించారు. సంతకు చేరుకున్న వివిధ గ్రామాలకు చెందిన ప్రజలను ఉద్దేశించి పాటల రూపంలో నాటకాన్ని ప్రదర్శించి ఆడపిల్లలను రక్షించుకోవడంతో పాటు చదివించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాథోడ్ శంకర్, గోడాం అశీష్, మోహన్‌నాయక్, తదితరులు పాల్గొన్నారు.