కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2021-07-13T04:04:33+05:30 IST

కరోనా నియంత్రణపై వైద్య ఆరోగ్య, పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ శాఖల అధికారు లు, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సయ్యద్‌ అలీ ముర్తుజా రిజ్వి అన్నారు. నస్పూర్‌ పట్టణంలోని సీసీసీ సింగరేణి అతిథి గృహంలో సోమవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, ప్రజారోగ్య శాఖ సంచాలకులు శ్రీని వాసరావు, వైద్య విద్య సంచాలకులు రమేష్‌రెడ్డి రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఎండి. చంద్రశేఖర్‌రెడ్డి, ఆరోగ్యశాఖ ఓఎస్‌డీ గంగాధర్‌, కలె క్టర్‌ భారతిహోళికేరితో కలిసి సమీక్ష సమావేశం నిర్వ హించారు.

కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలి
సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి

సమీక్ష సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి

నస్పూర్‌. జూలై 12: కరోనా నియంత్రణపై వైద్య ఆరోగ్య, పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ శాఖల అధికారు లు, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సయ్యద్‌ అలీ ముర్తుజా రిజ్వి అన్నారు. నస్పూర్‌ పట్టణంలోని సీసీసీ సింగరేణి అతిథి గృహంలో సోమవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, ప్రజారోగ్య శాఖ సంచాలకులు శ్రీని వాసరావు, వైద్య విద్య సంచాలకులు రమేష్‌రెడ్డి రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఎండి. చంద్రశేఖర్‌రెడ్డి, ఆరోగ్యశాఖ ఓఎస్‌డీ గంగాధర్‌,  కలె క్టర్‌ భారతిహోళికేరితో కలిసి సమీక్ష సమావేశం నిర్వ హించారు. కార్యదర్శి రిజ్వి మాట్లాడుతూ కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పట్టినప్పటికి అప్రమ  త్తంగా ఉండాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరి ధిలో నమోదైన పాజిటివ్‌ కేసులు, చికిత్స తీసుకుం టున్న వారు వైరస్‌ వ్యాప్తికి కారణాలు, నియంత్రణ, చికిత్స అందిస్తున్న వారి వివరాలను నివేదిక ద్వారా ఇవ్వాలన్నారు. కరోనా వైరస్‌ ప్రబలే ప్రాంతాల్లో నిఘా పెట్టి పర్యవేక్షించాలన్నారు. కొవిడ్‌ యాప్‌లో పాజిటివ్‌ కేసులు, కాంటాక్ట్‌లు నమోదు చేయాలని, కేసులు వచ్చి న గ్రామాల్లో పూర్తి స్థాయిలో వ్యాక్సిన్‌ వేయాలని   సూచించారు. అధికారుల పరస్పర సమన్వయంతో వైరస్‌ వ్యాప్తిని అరికట్టాలన్నారు. కొవిడ్‌ లక్షణాలు ఉన్న వారిని గుర్తించి వారిని ఐసోలోషన్‌కు పంపాల న్నారు. ఆరోగ్య కేంద్రాలల్లో నిర్ధేశించిన లక్ష్యం మేరకు పరీక్షలను చేయాలన్నారు. టెస్ట్‌ కిట్స్‌, వ్యాక్సిన్‌ కొరత లేదని చెప్పారు. వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు వైరల్‌ జ్వరాలు వస్తాయని, జ్వరాలపై జ్వర సర్వేలు చేయాలన్నారు. 18 సంవత్సరాలు దాటిన వారికి టీకా లు ముమ్మరంగా వేయాలన్నారు.  సమావేశంలో అదనపు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, ట్రైనీ కలెక్టర్‌ ప్రతిభా సింగ్‌, డీఎంహెచ్‌వో సుబ్బారాయుడు, ఉప వైద్యాధికారి ఫయాజ్‌, ప్రభుత్వ ఆసుపత్రి పర్యవేక్షకులు అరవింద్‌, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-07-13T04:04:33+05:30 IST