ఆన్‌లైన్‌ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2021-08-22T03:54:52+05:30 IST

ఆన్‌లైన్‌ మోసాల పట్ల ప్రజలు అప్ర మత్తంగా ఉండాలని రామగుండం పోలీసు కమిషనర్‌ ఎస్‌.చంద్రశేఖర్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మంచిర్యాల జిల్లాలో సైబర్‌ నేరాలను నివారించడానికి, కరపత్రాల ద్వారా గ్రామాలు, పట్టణాలలో ప్రచారం చేయాలని సీపీ ఆదేశించారు. వారం రోజుల వ్యవధిలో మంచిర్యాలకు చెందిన ఇద్దరు సైబర్‌ మోసాలకు గురైనట్లు తెలిపారు.

ఆన్‌లైన్‌ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
రామగుండం సిపి చంద్రశేఖర్‌ రెడ్డి

రామగుండం సిపి చంద్రశేఖర్‌ రెడ్డి

ఏసీసీ, ఆగస్టు 21: ఆన్‌లైన్‌ మోసాల పట్ల ప్రజలు అప్ర మత్తంగా ఉండాలని రామగుండం పోలీసు కమిషనర్‌ ఎస్‌.చంద్రశేఖర్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.  మంచిర్యాల జిల్లాలో సైబర్‌ నేరాలను నివారించడానికి,  కరపత్రాల ద్వారా గ్రామాలు, పట్టణాలలో ప్రచారం చేయాలని సీపీ ఆదేశించారు. వారం రోజుల వ్యవధిలో మంచిర్యాలకు చెందిన ఇద్దరు సైబర్‌ మోసాలకు గురైనట్లు తెలిపారు. ఆమెజాన్‌ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తామని ఎస్‌ ఎంఎస్‌ ద్వారా లింక్‌ పంపి బాధితుడి నుంచి రూ.30వేలు ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌ఫర్‌ చేయించుకొని అనంతరం లింక్‌ను  డెలిట్‌ చేశారని తెలిపారు. టైల్స్‌ షాపు నిర్వహించే మరో వ్యక్తికి ఫోన్‌ చేసి లారీ లోడు టైల్స్‌ తక్కువ ధరకు అంది స్తానని నమ్మించి లక్ష రూపాయలు అకౌంట్‌ ట్రాన్స్‌ఫర్‌ చేయించుకొని మోసం చేశారని తెలిపారు. ఆన్‌లైన్‌ మోసాలకు గురికాకుండా ఉండేందుకు ఫోన్‌లో ఉద్యో గాలు, లాటరీ, గిఫ్ట్‌ల పేరిట వచ్చే లింక్‌లను ఒపెన్‌ చేయవద్దని సూచించారు. సోషల్‌ మీడియాలో వచ్చే మోసపూరిత ప్రకటనలను నమ్మవద్దన్నారు. ఎవరైనా మోసం చేసి డబ్బులు కాజేస్తే తక్షణమే 155260, డయల్‌ 100కు తెలియచేయాల న్నారు. బాధితులు ఫిర్యాదు చేస్తే నేరగాళ్ళ బ్యాంక్‌ ఖాతాలను స్తంభింపచేసి నగదును బాధితుడి ఖాతాలో జమఅయ్యేలా చూస్తామన్నారు.

Updated Date - 2021-08-22T03:54:52+05:30 IST