ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

ABN , First Publish Date - 2021-10-14T05:30:00+05:30 IST

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయానికి ప్రతీక అయిన సద్దుల బతుకమ్మ వేడుక జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగింది. తీరొక్క పూలను సేకరించి ఇళ్లలో బతుకమ్మను పేర్చారు. ఆయా ఆలయాల్లో, గ్రామాల కూడళ్ల వద్ద బతుకమ్మలను ఉంచి పాటలు పాడారు. అనంతరం శోభాయాత్రగా బతుకమ్మలను తీసుకెళ్లి సమీప చెరువులు, వాగుల్లో నిమజ్జనం చేశారు. ఒకరికొకరు వాయినాలు ఇచ్చి పుచ్చుకొన్నారు.

ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
కాగజ్‌నగర్‌ సుభాష్‌ చంద్రబోస్‌ కాలనీలో బతుకమ్మలు

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయానికి ప్రతీక అయిన సద్దుల బతుకమ్మ వేడుక జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగింది. తీరొక్క పూలను సేకరించి ఇళ్లలో బతుకమ్మను పేర్చారు. ఆయా ఆలయాల్లో, గ్రామాల కూడళ్ల వద్ద బతుకమ్మలను ఉంచి పాటలు పాడారు. అనంతరం శోభాయాత్రగా బతుకమ్మలను తీసుకెళ్లి సమీప చెరువులు, వాగుల్లో నిమజ్జనం చేశారు. ఒకరికొకరు వాయినాలు ఇచ్చి పుచ్చుకొన్నారు.

ఆసిఫాబాద్‌, అక్టోబరు 14: సద్దుల బతుకమ్మ వేడుకలు గురువారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో... బంగారు బతుకమ్మ ఉయ్యాలో.. రామ రామ ఉయ్యాలో.. రామనే శ్రీరామ ఉయ్యాలో.. హరిహరి ఓ దేవఉయ్యాలో.. హరి యో బ్రహ్మదేవ ఉయ్యాలో.. అంటూ మహిళలు బతుకమ్మ పాటలతో హోరెత్తించారు. ఆలయ ప్రాంగణాల్లో, వీధులు, కూడళ్ల వద్ద మహిళలు బతుకమ్మ ఆటల సందడి కనువిందు చేసింది. చిన్నా పెద్ద తేడా లేకుండా మహిళలు సంప్రదాయ వస్త్రాలంకరణలతో లయబద్దంగా ఆడుతూ.. పాడుతూ.. సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. మహిళలు పోటీపడి విభిన్న రూపాల్లో బతుకమ్మలను పేర్చి అందంగా తీర్చిదిద్దారు. నూతన వస్త్రాలు, నగలు ధరించి ఒక్కచోట చేరి బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాటలు పాడారు. కోలాటం ఆడారు. గ్రామాల్లో భాజా బజంత్రీలు ఏర్పాటుచేసి మహిళలు నృత్యాలు చేశారు.  పట్టణంలో బ్రాహ్మణ్‌వాడ, రావులవాడ, కన్యకాపరమేశ్వరి ఆలయం, పొట్టి శ్రీరాములు చౌక్‌, కంచుకోట, తారక రామానగర్‌, రాజంపేట, సాయినగర్‌, పైకాజీనగర్‌, బజార్‌వాడీ, హడ్కోకాలనీ, సందీప్‌నగర్‌, జన్కాపూర్‌, దస్నాపూర్‌లో కాలనీల్లో మహిళలు ఆడిపాడారు. అలాగే జిల్లాలోని కాగజ్‌నగర్‌ సిర్పూర్‌(టి), కౌటాల, చింతలమానేపల్లి, బెజ్జూరు, దహెగాం, పెంచికలపేట, రెబ్బెన, వాంకిడి, కెరమెరి, జైనూర్‌, సిర్పూర్‌(యూ), లింగాపూర్‌, తిర్యాణి మండలాల్లో మహిళలు ఆనందోత్సాహాల మధ్య సద్దుల బతుకమ్మ సంబరాలను జరుపుకున్నారు. 

కాగజ్‌నగర్‌లో..

కాగజ్‌నగర్‌: కాగజ్‌నగర్‌ పట్టణంలో గురువారం సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని 30వార్డుల్లో వివిధకూడళ్లలో మహిళలు బతు కమ్మలను ఏర్పాటు చేసుకొని ఆటలు ఆడారు. అనంతరం ఎస్పీఎం క్రీడా మైదానంలో బతు కమ్మలతో వచ్చి ఆడారు. ఈ సందర్భంగా హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలు ఏర్పాటుచేశారు. సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ప్రత్యేక పూజీ కార్యక్ర మాలను నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బతుకమ్మ పండుగ భక్తి శ్రద్ధలతో జరుపు కోవాలన్నారు. ఈ సందర్భంగా ప్రసాద విత రణ కార్యక్రమాన్ని నిర్వహించారు. బీజేపీ నాయకుడు డాక్టర్‌ శ్రీనివాస్‌, హరీష్‌బాబుతో పాటు వివిధ పార్టీల నాయకులు కూడా పలు కార్య క్రమాల్లో పాల్గొన్నారు. సర్‌సిల్క్‌ కాలనీ, సుభాష్‌ చంద్రబోస్‌కాలనీ, మార్కె ట్‌ఏరియా, కన్యాకాపర మేశ్వరీ ఆలయం సమీపంలో నిర్వాహకులు భారీ ఏర్పాట్లను చేపట్టారు. ఎలాం టి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా డీఎస్పీ కరు ణాకర్‌ ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తును నిర్వహించారు. కార్యక్ర మాల్లో జడ్పీ వైస్‌ చైర్మన్‌ కోనేరు కృష్ణా రావు, కోనేరు చారిట బుల్‌ట్రస్టు ఛైర్మన్‌ కోనేరు వంశీతోపాటు వివిధ పార్టీల నాయ కులు, కార్యకర్తలు, తది తరులు పాల్గొ న్నారు.

మార్కెట్‌లో పండుగ సందడి..

 ఆసిఫాబాద్‌: సద్దుల బతుకమ్మ, దసరా పండగలతో సందడి నెలకొంది. గురువారం ప్రజలు షాపింగ్‌లో బిజీబిజీగా గడిపారు. దీంతో వస్త్ర దుకాణాలు, కిరాణం షాపులు రద్దీగా మారాయి. హిందువులకు దసరా అతిపెద్ద పండుగ. నవరాత్రి ఉత్సవాలు, శరన్నవరాత్రి ఉత్సవాలు జరుపుకున్న ప్రజలు చివరగా దసరా వేడుకలను నిర్వహించుకుంటారు. ఈ పండుగకు అందరూ కొత్త దుస్తులు ధరిస్తారు. అందుకే వస్త్ర దుకాణాలు కిటకిటలాడాయి. ఈ నేపథ్యంలో ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ పట్టణాల్లోని రెడీమేడ్‌ దుస్తుల దుకాణాలు సందడిగా మారాయి. అలాగే మహిళలకు అతి పెద్ద పండుగ అయిన సద్దుల బతుకమ్మ సందర్భంగా వివిధ రకాల పూలు, రంగుల కొనుగోలులో మహిళలు, యువతులు బిజీ బిజీగా గడిపారు. కొనుగోలు చేసిన తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా పేర్చారు. పండుగ కోసం ప్రజలు పట్టణాల నుంచి స్వగ్రామాల బాట పట్టడంతో గ్రామాల్లో సందడి నెలకొంది.

Updated Date - 2021-10-14T05:30:00+05:30 IST