అభివృద్ధిలో బ్యాంకర్లు భాగస్వాములు కావాలి
ABN , First Publish Date - 2021-10-30T03:58:14+05:30 IST
జిల్లా అభివృద్ధిలో బ్యాంకర్లు భాగస్వా ములు కావాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని వడ్డెపల్లి గార్డెన్స్‌లో శుక్రవారం అన్ని బ్యాంకుల ఆధ్వర్యంలో నిర్వహించిన రుణవితరణ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ వరుణ్‌రెడ్డితో కలిసి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

- కలెక్టర్ రాహుల్‌రాజ్
ఆసిఫాబాద్, అక్టోబరు 29: జిల్లా అభివృద్ధిలో బ్యాంకర్లు భాగస్వా ములు కావాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని వడ్డెపల్లి గార్డెన్స్‌లో శుక్రవారం అన్ని బ్యాంకుల ఆధ్వర్యంలో నిర్వహించిన రుణవితరణ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ వరుణ్‌రెడ్డితో కలిసి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల ఆర్థికాభివృద్ధికి బ్యాంకర్లు తోడ్పాటును అందించాలన్నారు. జిల్లాలో ఎక్కువ రైతులు ఒకే పంటపై ఆధారపడి జీవిస్తున్నారని చెప్పారు. పంట రుణాల విషయంలో బ్యాంకర్లకు ఇచ్చిన లక్ష్యాన్ని నెరవేర్చలేదన్నారు. పంట రుణం లక్ష్యాన్ని 90 శాతం చేరుకోవాలని నిర్దేశించినప్పటికీ ఆ దిశగా ప్రయత్నాలు చేయలేదని అసహనం వ్యక్తం చేశారు. బ్యాంకర్లు తమ విధానాలను మార్చుకోవాలని సూచించారు. అలాగే ప్రజల వద్ద ఆర్థికంగా ఎదుగుదల ఉంటేనే అభివృద్ధి సాఽధ్యమవుతుందని చెప్పారు. జిల్లాలో రుణం తీసుకున్న వారు తిరిగి చెల్లించడంలో ఎటువంటి బ్బందులకు గురి చేసినా తాము బ్యాంకర్లకు అండగా ఉంటామని చెబుతున్నామని అన్నారు. సిర్పూర్‌లో అనేక మంది దగ్గరి నుంచి రుణం రికవరీ చేయడంలో సహాయం చేశామని కలెక్టర్ గుర్తు చేశారు. ఇళ్లలో గిరిజనులు ఎక్కువగా ఉన్నారని వారికి వివిధ రకాల రుణాలు అందించి ఆర్థికంగా బలపడే విధంగా చేయాలన్నారు. జిల్లాలో రుణం తీసుకున్న రైతులు 40 వేల మంది ఉన్నారని అన్నారు. వీరికి ఇతర రకాల రుణాలు ఇచ్చి వారిని ప్రోత్సహించాలని సూచించామని తెలిపారు. అయినప్పటకీ ఇప్పటి వరకు కేవలం రెండు వేల మందికి మాత్రమే రుణం అందించారని అన్నారు. జిల్లా అభివృద్ధికి బ్యాంకింగ్ సెక్టార్ ఎంతో ముఖ్యమైనది చెప్పారు. జిల్లాలో మాల్ న్యూట్రిషన్ తగ్గించడం సాధ్యమైందని, కానీ బ్యాంకింగ్ సెక్టార్ సరి చేయడం తమ వల్ల కావడం లేదని అన్నారు. రుణ వితరణ కార్యక్రమం మంచిదేనని అయితే ఇది కేవలం పేరు కోసం మాత్రమే చేయకూడదని చురకలంటించారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ వరుణ్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో నిర్దేశించిన రంగాలకు రుణాలు అందజేయాని కోరారు. జిల్లాలో వెయ్యి లీటర్ల సామర్థ్యంతో ఆసిఫాబాద్, వాంకిడి, రెబ్బెన, కాగజ్‌నగర్ కేంద్రాలలో పాల కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. రైతులకు హైబ్రిడ్ పశువులు కొనుగోలు చేశామని సూచించామని అన్నారు. బ్యాంకర్లు వారికి రుణాలు అందించాలన్నారు. హ్యాండ్ క్రాప్ట్ మార్కెట్ కోసం హైదరాబాద్, మంచిర్యాల లాంటి ప్రాంతాలకు తయారీ వస్తువులు పంపించే ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఢిల్లీలో వచ్చే నెల 16 నుంచి 31 వరకు హ్యాండ్ క్రాప్ట్ మేళాలో ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన డ్వాక్రా గ్రూపు సభ్యులు పాల్గొంటున్నారని అన్నారు. వీరికి బ్యాంకులు కొంత సాయం చేయడంతో ఇది సాధ్యమైందన్నారు. జిల్లాలో పుట్టగొడుగు లు, వెదురు సాగుకు బ్యాంకర్లు రుణం అందించాలని చెప్పారు. అలాగే విద్యార్థులకు విద్య రుణాలు అందించేందుకు చర్యలు తీసుకో వాలని కోరారు. అనంతరం ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ స్వయం సహాయక సంఘాలకు బ్యాంకర్లు అందిస్తున్న రుణాలకు సంబంధించి చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో లీడ్ బ్యాంకు మేనేజర్ కోవ హనుమంతరావు, ఎస్బీఐ నిజామాబాద్ డీజీఎం ప్రపుల్లకుమార్, తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఆర్‌ఎం శ్రీనివాస్‌రెడ్డి, ఏడీసీసీ ఏజీఎం అభయ్‌కుమార్, అన్ని శాఖల బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.