కన్నుల పండువగా అయ్యప్పస్వామి శోభాయాత్ర

ABN , First Publish Date - 2021-12-27T04:00:33+05:30 IST

పట్టణంలో ఆదివారం రాత్రి అయ్యప్పస్వామి శోభాయాత్ర కార్యక్రమం కన్నుల పండువగా సాగింది. రాంమందిర్‌ ఆలయం నుంచి శోభాయాత్ర ప్రారంభం కాగా జడ్పీ వైస్‌చైర్మన్‌ కోనేరు కృష్ణారావు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కాసం శ్రీనివాస్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కన్నుల పండువగా అయ్యప్పస్వామి శోభాయాత్ర
శోభాయాత్రలో పాల్గొన్న మహిళలు

కాగజ్‌నగర్‌, డిసెంబరు 26: పట్టణంలో ఆదివారం రాత్రి అయ్యప్పస్వామి శోభాయాత్ర కార్యక్రమం కన్నుల పండువగా సాగింది. రాంమందిర్‌ ఆలయం నుంచి శోభాయాత్ర ప్రారంభం కాగా జడ్పీ వైస్‌చైర్మన్‌ కోనేరు కృష్ణారావు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కాసం శ్రీనివాస్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శోభాయాత్ర ప్రారంభించారు. అయ్యప్ప మాలధారణ చేసిన స్వాములు నృత్యాలు, భజనలు చేస్తూ శోభాయాత్ర నిర్వహించారు. ఇరువైపులా మహిళలు దీపాలను చేతబూని స్వామికి స్వాగతం పలికారు. పట్టణమంతా అయ్యప్ప స్వామి శరణు ఘోషతో  మారుమోగింది.

Updated Date - 2021-12-27T04:00:33+05:30 IST