క్షయవ్యాధిపై అవగాహన ర్యాలీ

ABN , First Publish Date - 2021-03-25T05:04:00+05:30 IST

హాజీపూర్‌ మండలం చంద నాపూర్‌లో జిల్లా వైద్యాధికారిణి నీరజ క్షయ వ్యాధిపై అవగాహన ర్యాలీని బుధవారం ప్రారంభించారు.

క్షయవ్యాధిపై అవగాహన ర్యాలీ
ర్యాలీ ప్రారంభిస్తున్న జిల్లా వైద్యాధికారి నీరజ

హాజీపూర్‌, మార్చి24: హాజీపూర్‌ మండలం చంద నాపూర్‌లో జిల్లా వైద్యాధికారిణి నీరజ క్షయ వ్యాధిపై అవగాహన ర్యాలీని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెండు వారాలకంటే ఎక్కువగా దగ్గు వస్తుంటే టీబీ పరీక్షలు చేయించుకోవాలన్నారు. 415 కేసులు నమోదు కాగా 359 మంది కోలుకున్నట్లు తెలిపారు. అనంతరం హెల్త్‌వర్కర్లకు, బెస్ట్‌ ఉద్యోగులకు, టీబీని జయించిన వారికి ప్రశంసపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీబీ ప్రోగ్రాం అధికారి అనిష్‌, డిప్యూటీ డీఎంహెచ్‌వో ఫయాజ్‌ఖాన్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-03-25T05:04:00+05:30 IST