నట్టల నివారణతో వ్యాధులు దూరం

ABN , First Publish Date - 2021-08-10T07:25:07+05:30 IST

వ్యవసాయానికి అనుబంధంగా చేపట్టే గొర్రెలు, మేకలు పెంచుకునే రైతులు గొర్రెలు, మేకలకు తప్పని సరిగా నట్టల నివారణ మందును వేయించాలని డాక్టర్‌ శ్రావణ్‌కుమార్‌ కోరారు.

నట్టల నివారణతో వ్యాధులు దూరం

బోథ్‌, ఆగస్టు 9: వ్యవసాయానికి అనుబంధంగా చేపట్టే గొర్రెలు, మేకలు పెంచుకునే రైతులు గొర్రెలు, మేకలకు తప్పని సరిగా నట్టల నివారణ మందును వేయించాలని డాక్టర్‌ శ్రావణ్‌కుమార్‌ కోరారు. సోమవారం బోథ్‌లో నట్టల నివారణ మందు కార్యక్రమాన్ని సర్పంచ్‌ సురేందర్‌యాదవ్‌ చేతుల మీదుగా ప్రారంభించారు. నట్టల మందు వేయించినట్లయితే వివిధ రకాల వ్యాధులు రావని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో సిబ్బంది తేజస్విని, పోచక్క, మహేష్‌, రమేష్‌లున్నారు.

గుడిహత్నూర్‌: మేకలు గొర్రెలకు నట్టల నివారణ మందును అందించాలని మండల పశువైద్యాధికారి రాథోడ్‌ జీవన్‌ అన్నారు. సోమవారం మండలంలోని ముత్నూర్‌, నేరడిగొండతాండ, హర్కపూర్‌ గ్రామాల్లో నట్టల నివారణ మందు పంపిణీ చేశారు. మొత్తం మేకలు, గొర్రెలకు నట్టల నివారణ మందు వేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు, సిబ్బంది పాల్గొన్నారు.


Updated Date - 2021-08-10T07:25:07+05:30 IST