బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు

ABN , First Publish Date - 2021-10-21T03:56:15+05:30 IST

సదాశివపేటలో బాల్య వివాహాన్ని బుధవారం అధికారులు అడ్డుకున్నారు. మండల పరిధిలోని ముబారక్‌పూర్‌ బి గ్రామానికి చెందిన ఓ బాలికను హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడికి ఇచ్చి పెళ్లి చేసే క్రమంలో ఎస్‌ గార్డెన్‌లో బుధవారం ఉదయం 11 గంటలకు వివాహ తంతును ప్రారంభించారు.

బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు

సదాశివపేట, అక్టోబరు 20: సదాశివపేటలో బాల్య వివాహాన్ని బుధవారం అధికారులు అడ్డుకున్నారు. మండల పరిధిలోని ముబారక్‌పూర్‌ బి గ్రామానికి చెందిన ఓ బాలికను హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడికి ఇచ్చి పెళ్లి చేసే క్రమంలో ఎస్‌ గార్డెన్‌లో  బుధవారం ఉదయం 11 గంటలకు వివాహ తంతును ప్రారంభించారు. ఇంతలోనే జిల్లా చైల్డ్‌ ప్రొటెక్షన్‌ సెల్‌, ఐసీడీఎస్‌, సఖీ కేంద్రాల అధికారులు పోలీసుల సహాయంతో ఎస్‌ గార్డెన్‌కు చేరుకుని బాల్యవివాహాన్ని అడ్డుకున్నారు. బాలిక వయస్సు 5 నెలలు తక్కువగా ఉందని, 18  ఏళ్లు నిండిన తర్వాతనే వివాహం చేసుకోవచ్చని బాలిక తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. కార్యక్రమంలో చైల్డ్‌ ప్రొటెక్షన్‌ సెల్‌, సఖీ కేంద్రం, ఐసీడీఎస్‌ అధికారులు ప్రశాంతి, విమల పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-21T03:56:15+05:30 IST