విధుల్లో ఉన్న వైద్యసిబ్బందిపై దాడి హేయనీయం
ABN , First Publish Date - 2021-05-08T06:32:39+05:30 IST
నేడు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కోవిడ్ 19 మహమ్మారిపై పోరులో కోవిడ్ బారిన పడిన ప్రజలను కాపాడుకునేందుకు గత ఏడాదికాలంగా అలుపెరగకుండా శ్రమిస్తున్న వైధ్యసిబ్బందిపై దాడికి దిగడం హ్యేయమైన చర్య అని ఖానాపూర్ ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ వంశీమాదవ్ అన్నారు.

ఖైరతాబాద్ ఘటనపై ఖానాపూర్‌లో వైద్యులు, సిబ్బంది నిరసన
ఖానాపూర్, మే 7 : నేడు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కోవిడ్ 19 మహమ్మారిపై పోరులో కోవిడ్ బారిన పడిన ప్రజలను కాపాడుకునేందుకు గత ఏడాదికాలంగా అలుపెరగకుండా శ్రమిస్తున్న వైధ్యసిబ్బందిపై దాడికి దిగడం హ్యేయమైన చర్య అని ఖానాపూర్ ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ వంశీమాదవ్ అన్నారు. ఖైరతాబాద్ టీకా కేంద్రం వద్ద విధులు నిర్వహిస్తున్న ఏఎన్‌ఎంలపై ఓ వ్యక్తి దాడికి పాల్పడడాన్ని నిరసిస్తూ శుక్రవారం ఖానాపూర్ ప్రభుత్వాసుపత్రి ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా పలువురు మాట్లాడుతూ ఇటువంటి చర్యలకు పాల్పడే వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కోవిడ్ టీకా కేంద్రాల వద్ద, పరిక్షా కేంద్రాల వద్ద సిబ్బందికి రక్షణ కల్పించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు అరవింద్, తిలక్, రాకేష్, హెల్త్ ఎడ్యూకేటర్ జయలలిత, రవికుమార్, హెల్త్ సూపర్‌వైజర్ కన్నయ్య, సిబ్బంది సుజాత, షఫీనాసుల్తానా, వెంకటమ్మ, సురేష్, కమల, తిరుమల, తదితరులున్నారు.