తాగిన మైకంలో భార్యపై బ్లేడ్‌తో దాడి

ABN , First Publish Date - 2021-02-26T05:53:56+05:30 IST

మద్యం మత్తులో కట్టుకున్న భార్యపై బ్లేడ్‌తో దాడి చేసిన సంఘటన మండలంలోని ధన్నోర(బి)లో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ధన్నోర (బి)లోని జనతాగూడలో నివసించే తుకారం(35), రాధ(30)లు పదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు.

తాగిన మైకంలో భార్యపై బ్లేడ్‌తో దాడి

ఇంద్రవెల్లి, ఫిబ్రవరి 25: మద్యం మత్తులో కట్టుకున్న భార్యపై బ్లేడ్‌తో దాడి చేసిన సంఘటన మండలంలోని ధన్నోర(బి)లో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ధన్నోర (బి)లోని జనతాగూడలో నివసించే తుకారం(35), రాధ(30)లు పదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. రోజువారీ కూలీ చేసే తుకారం కొంత కాలంగా తాగుడికి బానిసై నిత్యం భార్యను వేధించేవాడు. గురువారం మధ్యాహ్నం కూడా తాగివచ్చి భార్యతో గొడవకు దిగిన అతడు బ్లేడ్‌తో భార్య మెడ భాగంలో తీవ్రంగా గాయపరిచాడు. స్థానికులు వెంటనే రాధను చికిత్స నిమత్తం రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. 

Updated Date - 2021-02-26T05:53:56+05:30 IST