సౌండ్ తగ్గించలేదని బర్త్‌డే పార్టీలో బీభత్సం

ABN , First Publish Date - 2021-06-22T20:39:04+05:30 IST

హైదరాబాద్‌: నాంపల్లిలో ఆకతాయిలు బరితెగించారు. పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నవారిపై దాడి చేశారు. బ్యాండ్‌ సౌండ్ తగ్గించాలంటూ 10 మంది యువకులు బీభత్సానికి పాల్పడ్డారు.

సౌండ్ తగ్గించలేదని బర్త్‌డే పార్టీలో బీభత్సం

హైదరాబాద్‌: నాంపల్లిలో ఆకతాయిలు బరితెగించారు. పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నవారిపై దాడి చేశారు. బ్యాండ్‌ సౌండ్ తగ్గించాలంటూ 10 మంది యువకులు బీభత్సానికి పాల్పడ్డారు. వేడుకలు చేసుకుంటున్న వారిపై కర్రలు, రాడ్లతో దాడికి దిగారు. ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. కుర్చీలు బల్లలు విరగ్గొట్టారు. దుండగుల దాడిలో పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించి చికిత్స అందించారు. క్షతగాత్రుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారు. దాడిపై బాధితులు నాంప‌ల్లి పోలీసు స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

Updated Date - 2021-06-22T20:39:04+05:30 IST