ఇంటర్‌ విద్యార్థులకు అసైన్‌మెంట్‌ పరీక్షలు నిర్వహించాలి

ABN , First Publish Date - 2021-10-08T03:44:48+05:30 IST

ఇంటర్మీడియట్‌ మొద టి సంవత్సరం విద్యార్థులకు ప్రత్యక్ష పరీక్షలకు బదులుగా ఆసైన్‌మెంట్‌ పరీక్షలు నిర్వహించాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. గురువారం మంచిర్యాల కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించి ఏవో సురేష్‌కు వినతి పత్రం అంద జేశారు.

ఇంటర్‌ విద్యార్థులకు అసైన్‌మెంట్‌ పరీక్షలు నిర్వహించాలి
కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహిస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు

మంచిర్యాల కలెక్టరేట్‌, అక్టోబరు 7: ఇంటర్మీడియట్‌ మొద టి సంవత్సరం విద్యార్థులకు ప్రత్యక్ష పరీక్షలకు బదులుగా ఆసైన్‌మెంట్‌ పరీక్షలు నిర్వహించాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. గురువారం మంచిర్యాల కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించి ఏవో సురేష్‌కు వినతి పత్రం అంద జేశారు. వారు మాట్లాడుతూ సిలబస్‌ పూర్తి కాకుండా పరీక్షలు ఎలా నిర్వహిస్తారని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ నెల 25 నుంచి ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యార్థులకు  పరీక్షల టైం టెబుల్‌ను విడుదల చేసిందని, పరీక్షల నిర్వహణపై బోర్డు పునరాలోచించాలని కోరారు. 18 నెలల నుంచి కాలేజీలు మూసి ఉన్నందున సిలబస్‌ పూర్తి కాలేదని, కార్పొరేట్‌ కళాశాలల స్వలాభం కోసం ప్రభుత్వం పరీక్షల నిర్వహణకు సిద్ధమైందని విమర్శించారు. నాయకులు సమీర్‌, నాదిమ్‌, అభిషేక్‌, కృష్ణ, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-10-08T03:44:48+05:30 IST