ఆశ్రమ పాఠశాలలను తెరిపించాలి

ABN , First Publish Date - 2021-10-19T07:06:17+05:30 IST

రోనా కారణంగా మూతపడిన గిరిజన సంక్షేమశాఖ ఆశ్రమ పాఠశాలలను, గురుకుల పాఠశాలలు, వసతి గృహాలను వెంటనే తెరిపించాలని ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి మంగం మహేశ్వర రావ్‌ కోరారు.

ఆశ్రమ పాఠశాలలను తెరిపించాలి

ఉట్నూర్‌, అక్టోబరు 18: కరోనా కారణంగా మూతపడిన గిరిజన సంక్షేమశాఖ ఆశ్రమ పాఠశాలలను, గురుకుల పాఠశాలలు, వసతి గృహాలను వెంటనే తెరిపించాలని ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి మంగం మహేశ్వర రావ్‌ కోరారు. సోమవారం ఐటీడీఏ పీవో భవేశ్‌ మిశ్రాను కలిసి మెమోరండం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొవిడ్‌ దృష్ట్యా ఆదివాసీ గిరిజన విద్యార్థులు బడులకు దూరమవుతున్నారు. గిరిజన విద్యార్థుల భవిష్యత్తు అంధకారం అవుతున్నందున వెంటనే పాఠశాలలను తెరిపించి గిరిజన విద్యార్థుల చదువులకు దూరం గాకుండా కాపాడాలన్నారు. ఆయన వెంట జిల్లా అధ్యక్షుడు సిడాం జంగుదేవ్‌, ప్రధాన కార్యదర్శి రాజారామ్‌, మంగం ధీపక్‌, త్రిమూర్తి, అర్జున్‌, మహేష్‌ ఉన్నారు.

సిరికొండ: కరోనా మహమ్మారి దృష్ట్యా రెండేళ్లుగా మూతబడిన గురుకుల పాఠశాలలు,  గిరిజన  ఆశ్రమ పాఠశాలలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాలను తక్షణమే తెరిపించాలని ఆదివాసీ విద్యార్థి సంఘం నాయకుడు నాగోరావ్‌ అన్నారు. ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలు తెరవక పోవడంతో గిరిజన విద్యార్థులను స్థానికంగా ఉన్న పాఠశాలల్లో  పంపించడం జరుగుతుందని, తద్వారా సరైన విద్య అందక విద్యార్థులు నష్టపోవాల్సి వస్తుందని ఆయన వాపోయారు.


Updated Date - 2021-10-19T07:06:17+05:30 IST