గంజాయి రవాణాలో కీలక సూత్రధారి అరెస్టు

ABN , First Publish Date - 2021-11-02T06:25:33+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విశాఖపట్నం ఏజెన్సీ నుంచి ముంబైకి గంజాయిని తరలిస్తున్న కీలక సూత్రధారి షేక్‌ అక్తా రున్నీసా బేగం(38)ను విశాఖపట్నంలో అరెస్టు చేసినట్లు సోన్‌ సీఐ రాం నర్సింహారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.

గంజాయి రవాణాలో కీలక సూత్రధారి అరెస్టు

సోన్‌, నవంబరు 1 : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విశాఖపట్నం ఏజెన్సీ నుంచి ముంబైకి గంజాయిని తరలిస్తున్న కీలక సూత్రధారి షేక్‌ అక్తా రున్నీసా బేగం(38)ను విశాఖపట్నంలో అరెస్టు చేసినట్లు సోన్‌ సీఐ రాం నర్సింహారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. గత ఏడాది డిసెంబరులో సోన్‌ మండలం గంజాల్‌ మీదుగా లారీలో కొబ్బరి మొక్కల చాటున గంజాయిని తరలిస్తున్న ఏడుగురు అంతర్రాష్ట్ర స్మగ్లర్లను అరెస్టు చేసి 326కిలోల గంజా యిని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ ముఠాలో పరారీలో ఉన్న మహిళా స్మగ్లర్‌ను పట్టుకునేందుకు జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ ప్రవీణ్‌కుమార్‌ ఆదేశాల మేరకు ఎస్సై ఆసిఫ్‌ నేతృత్వంలో స్పెషల్‌ టీం ఏర్పాటు చేసి నాలుగు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్‌కు పంపించామన్నారు. విశాఖపట్నం వెళ్లిన స్పెషల్‌ టీం చాకచక్యంగా వ్యవహరించి అంతర్రాష్ట్ర గంజాయి సూత్రధారి షేక్‌ అక్తారున్నీసా బేగంను అదుపులోకి తీసుకుని జిల్లాకు తీసుకొచ్చారన్నారు. నిందితురాలిని సోమవారం న్యాయస్థానంలో హాజరుపరచి.. రిమాండ్‌కు తరలించినట్టు రాం నర్సింహారెడ్డి వివరించారు. 


Updated Date - 2021-11-02T06:25:33+05:30 IST