ప్రాజెక్టుల పనులు పూర్తయ్యేదెన్నడో?

ABN , First Publish Date - 2021-11-03T04:04:22+05:30 IST

కుమరం భీం ఆసాఫిబాద్‌ జిల్లాలో ఏళ్లు గా ప్రధాన ప్రాజెక్టుల పనులు పూర్తి కాకపోవడంతో రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతోంది

ప్రాజెక్టుల పనులు పూర్తయ్యేదెన్నడో?
జగన్నాథ్‌పూర్‌ ప్రాజెక్టు

- ఏళ్లుగా ముందుకు సాగని వైనం
- నీటి వనరులున్నా ప్రయోజనం కరువు
- పట్టించుకోని అధికారులు
- ఇబ్బందులు పడుతున్న రైతులు

ఆసిఫాబాద్‌, నవంబరు 2: కుమరం భీం ఆసాఫిబాద్‌ జిల్లాలో ఏళ్లు గా ప్రధాన ప్రాజెక్టుల పనులు పూర్తి కాకపోవడంతో రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతోంది. సరైన సాగునీటి వసతి లేక వేలాది ఎకరాల భూమి నిరుపయోగంగా మారుతుంది. గత్యంతరం లేక ఆరుతడి పంట లతో సరిపెట్టాల్సి వస్తుంది. చివరి వానస్తే పంట లేకుంటే లేదు అన్న పరిస్థితుల్లో అన్నదాతలు ఇక్కట్లు పడుతున్నారు. ప్రాజెక్టు పూర్తై సక్ర మంగా నీరందిస్తే తప్ప సాగు పండుగలా మారే పరిస్థితి కనిపించడం లేదు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు ఉన్నప్పటికీ అవి పెండింగ్‌లోనే ఉన్నాయి. ప్రధానంగా కుమరం భీం ప్రాజెక్టు, జగన్నాథ్‌పూర్‌ ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తి స్థాయిలో కాలేదు. అదే విధంగా వట్టివాగు, చెలి మెల వాగు ప్రాజెక్టు కాలువలు మరమ్మతులకు నోచుకోవడం లేదు.

పూర్తి కాని కుమరం భీం
జిల్లాలో సాగునీటికి గుండెకాయ వంటి కుమరం భీం ప్రాజెక్టు  పనులు పూర్తి స్థాయిలో చేపట్టక పోవడంతో  ఏళ్లుగా రైతులకు పూర్తి స్థాయిలో సాగునీరందించడం లేదు. పది టీఎంసీల సామర్థ్యంతో సు మారు రూ.600 కోట్లకు పైగా అంచనాలతో నిర్మితమైన ఈ ప్రాజెక్టు లక్ష్యంలో సగం కూడా నీరందించడం లేదు. కుడి ప్రధాన కాలువ ద్వారా ఆసిఫాబాద్‌ మండల పరిధిలో ఆరు వేల ఎకరాలు, ప్రధాన ఎడమ కాలువ ద్వారా ఆసిఫాబాద్‌తో పాటు కాగజ్‌నగర్‌, సిర్పూర్‌(టి) మండ లాల్లోని 45,500 ఎకరాలకు సాగునీటిని అందించాలని ప్రాజెక్టును రూపొందించారు. ప్రాజెక్టు  నిర్మాణం పూర్తై ఏళ్లు గడుస్తున్నా కాలువల పనులు చేపట్టక పోవడంతో రైతులకు సాగునీరు అందడం లేదు.

24,500 ఎకరాల ఆయకట్టు..
ఆసిఫాబాద్‌ మండలం వట్టివాగు నీటిని స్థానిక పొలాలకు అందిం చాలనే ఉద్దేశ్యంతో 1998లో 24,500 ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. కుడి కాలువ ద్వారా 21,800 ఎకరాలు, ఎడ మ కాలువ ద్వారా 2700 ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా నిర్దేశించారు. కాలువలు ప్రాజెక్టు నిర్మాణం నుంచి ఆధునీకరణకు నోచుకోవడం లేదు. దీనికి తోడు ఇప్పటికే కాలువలు మొత్తం దెబ్బతిన్నాయి. లైనింగ్‌ కో ల్పోయి చెట్లు ఏపుగా పెరిగి అధ్వాన్నంగా మారాయి. చాలా చోట్ల కాలు వలు నామరూపాలు లేకుండా పోయాయి. దీంతో ఆసిఫాబాద్‌, రెబ్బెన మండలాల పరిధిలోని ఆయకట్టు రైతులకు సాగునీరు అందించే స్థితిలో లేదు. అధికారులు ఆధునీకరణ పనుల కోసం ప్రతిపాదనలు పంపినప్పటికీ వాటికి నిధులు విడుదల కాలేదు.

నత్తనడకన..
కాగజ్‌నగర్‌ మండలంలోని పెద్దవాగు పై నిర్మించిన జగన్నాథ్‌పూర్‌ ప్రాజెక్టు పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. కాగజ్‌నగర్‌, దహెగాం మండలాల పరిధి 15,000 ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో ప్రాజెక్టు నిర్మాణ పనులను చేపట్టినప్పటికీ పనుల్లో అల సత్వం చోటు చేసు కుంది. భూ సేకరణ, తదితర సమస్యలతో పనుల్లో తీవ్ర జాప్యం జరుగు తుంది. దీంతో ప్రాజెక్టు నిర్మాణం పనుల్లో జాప్యంతో ఆయకట్టు దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణం చేపడితే తమ భూము లు సస్యశ్యామలమవుతాయని ఆశించిన రైతులకు నిరాశ తప్పడం లేదు.


ప్రాజెక్టులపై పట్టింపు కరువు..
- బోగే ఉపేందర్‌, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు

వ్యవసాయానికే పెద్ద పీట వేస్తున్నామని గొప్పలు చెబుతున్న ప్రభు త్వం జిల్లాలో ప్రాజెక్టుల పనులు పూర్తి చేసే విషయాలన్ని పట్టించుకోవ డం లేదు. ప్రాజెక్టు కాలువల పునరుద్ధరణ, మిగిలి ఉన్న ప్రాజెక్టుల పనులను వెంటనే  పూర్తి చేయాలి. రైతులకు ఇబ్బందులు కలుగకుండా సాగునీరు అందించాలి.

Updated Date - 2021-11-03T04:04:22+05:30 IST