అవిశ్వాసంపై ఆర్డీవో విచారణ

ABN , First Publish Date - 2021-11-03T03:56:05+05:30 IST

గుల్లకోట పంచాయతీ కార్యాలయంలో మంగళవారం ఆర్డీవో దాసరి వేణు ఆధ్వర్యంలో ఉపసర్పంచు ఆవునూరి రవి అవిశ్వాసంపై సమావేశం నిర్వహించారు. ఉపసర్పంచు రవిపై వార్డు సభ్యులు అవిశ్వాసం ప్రకటించారు.

అవిశ్వాసంపై ఆర్డీవో విచారణ
విచారణ చేపడుతున్న ఆర్డీవో

లక్షెట్టిపేటరూరల్‌, నవంబరు 2:  గుల్లకోట పంచాయతీ కార్యాలయంలో మంగళవారం  ఆర్డీవో దాసరి వేణు ఆధ్వర్యంలో ఉపసర్పంచు ఆవునూరి రవి అవిశ్వాసంపై సమావేశం నిర్వహించారు.  ఉపసర్పంచు రవిపై వార్డు సభ్యులు అవిశ్వాసం ప్రకటించారు. ఆర్డీవో పంచాయతీలోని సర్పంచు, వార్డు సభ్యులతో విచారణ చేపట్టారు. సభ్యులు ఉపసర్పంచుపై అవిశ్వాసానికి ఆమోదం తెలపడంతో ఆర్డీవో ఆమోదపత్రాన్ని స్వీకరించారు. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం ఉపసర్పంచు ఎన్నిక చేపడతామని ఇన్‌చార్జి ఎంపీడీవో అజ్మత్‌ ఆలీ తెలిపారు. సర్పంచు గోళ్ల రవీందర్‌, పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-03T03:56:05+05:30 IST