‘ఉపాధ్యాయులకు క్షమాపణ చెప్పాలి’

ABN , First Publish Date - 2021-02-02T04:59:47+05:30 IST

ఉద్యోగ, ఉపాధ్యాయులకు వ్యతి రేకంగా పీఆర్సీపై వాస్తవ విరుద్ధంగా వ్యాసం ప్రచురించిన నమస్తే తెలంగాణ పత్రిక క్షమాపణ చెప్పాలని టీటీయూ జిల్లా అధ్యక్షుడు జి.చంద్రశేఖర్‌ డిమాండ్‌ చేశారు.

‘ఉపాధ్యాయులకు క్షమాపణ చెప్పాలి’

నిర్మల్‌ కల్చరల్‌, ఫిబ్రవరి 1: ఉద్యోగ, ఉపాధ్యాయులకు వ్యతి రేకంగా పీఆర్సీపై వాస్తవ విరుద్ధంగా వ్యాసం ప్రచురించిన నమస్తే తెలంగాణ పత్రిక క్షమాపణ చెప్పాలని టీటీయూ జిల్లా అధ్యక్షుడు జి.చంద్రశేఖర్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం విడుదల చేసిన ప్రక టనలో అశాస్ర్తీయంగా రూపొందించిన పీఆర్సీపై తమ అభిప్రాయం వ్యక్తం చేసే హక్కు సంఘాలకుందని పేర్కొన్నారు. పెరిగిన ధరల కనుగుణంగా పీఆర్సీ ఉండాలన్న ధ్యేయంతో ఫిట్‌మెంట్‌ కోరామని, అది గొంతెమ్మ కోరిక కాదన్నారు. ఇప్పటికైనా వాస్తవాలు ప్రచురించి నిబద్ధత కాపాడుకోవాలని హితవు పలికారు. 

Updated Date - 2021-02-02T04:59:47+05:30 IST