నాణ్యతాలోపంతో పనులు చేయడంపై ఆగ్రహం
ABN , First Publish Date - 2022-01-01T04:17:19+05:30 IST
ఖేడ్ మున్సిపాలిటీ పరిధిలో స్టార్టప్ నిధుల ద్వారా చేపట్టిన పనుల్లో నాణ్య త లోపించినప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని, పనులు చేపట్టిన కాంట్రాక్టరుపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్‌లీడర్ ఆనంద్‌స్వరూప్ షెట్కా ర్, డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ దారం శంకర్, కౌన్సిలర్లు వివేకానంద్, రాజే్‌షనాయక్ శుక్రవారం మున్సిపల్ కమిషనర్ మల్లారెడ్డిని నిలదీశారు.

మున్సిపల్ కమిషనర్‌ను నిలదీసిన కాంగ్రెస్ కౌన్సిలర్లు
నారాయణఖేడ్, డిసెంబరు 31: ఖేడ్ మున్సిపాలిటీ పరిధిలో స్టార్టప్ నిధుల ద్వారా చేపట్టిన పనుల్లో నాణ్య త లోపించినప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని, పనులు చేపట్టిన కాంట్రాక్టరుపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్‌లీడర్ ఆనంద్‌స్వరూప్ షెట్కా ర్, డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ దారం శంకర్, కౌన్సిలర్లు వివేకానంద్, రాజే్‌షనాయక్ శుక్రవారం మున్సిపల్ కమిషనర్ మల్లారెడ్డిని నిలదీశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్టార్టప్ నిధుల ద్వారా ఎక్సైజ్ కార్యాలయం నుంచి వేసిన సీసీరోడ్డుతో పాటు మరోచోట వేసిన సీసీరోడ్డు ఏడాది గడవక ముందే పాడైందన్నారు. నిధులు మంజూరై మూడేళ్లవుతున్నా పలు వార్డుల్లో పనులు ఇప్పటికీ ప్రారంభించలేదన్నారు. ప్రధానంగా కాంగ్రెస్ కౌన్సిలర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డుల్లో పనులు చేపట్టడం లేదన్నారు. మున్సిపల్ సాధారణ సమావేశాలకు సమాచారం, ఎజెండా ఇవ్వడం లేదని వారు ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో తాము ప్రజల సమస్యలను ఏవిధంగా పరిష్కరించగలుగుతామని ప్రశ్నించారు. మున్సిపాలిటీ పరిధిలో పలు విషయాల్లో చిత్తశుద్ధితో పని చేస్తున్నారని కమిషనర్‌ను కొనియాడుతూ, ప్రధానమైన అభివృద్ధి పనుల విషయాలను సైతం పరిగణలో కి తీసుకోవాలని కోరారు. తమకు సకాలంలో సమాచారం ఇవ్వకుండా సమావేశాన్ని ఎలా నిర్వహిస్తారని ఆరోపిస్తూ, కాంగ్రెస్ కౌన్సిలర్లు శుక్రవారం నిర్వహించిన మున్సిపల్ సమావేశాన్ని బహిష్కరించారు.