కళాశాలలను పరిశీలించిన పరిశీలకుడు

ABN , First Publish Date - 2021-12-07T05:36:29+05:30 IST

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల రాష్ట్ర పరిశీలకులు, టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ నవీన్‌మిట్టల్‌ ఎన్నికల ఏర్పాటు పరిశీలనలో భాగంగా పట్టనంలోని పాలిటెక్నిక్‌, ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాలలను సందర్శించి పరిశీలించారు. ఈ మేరకు ఆయా అధికారులతో కలిసి కళాశాలల్లో ఏర్పాట్లను గురిం చి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు తగు

కళాశాలలను పరిశీలించిన పరిశీలకుడు

ఆదిలాబాద్‌ టౌన్‌, డిసెంబరు 6: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల రాష్ట్ర పరిశీలకులు, టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ నవీన్‌మిట్టల్‌ ఎన్నికల ఏర్పాటు పరిశీలనలో భాగంగా పట్టనంలోని పాలిటెక్నిక్‌, ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాలలను సందర్శించి పరిశీలించారు. ఈ మేరకు ఆయా అధికారులతో కలిసి కళాశాలల్లో ఏర్పాట్లను గురిం చి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు తగు సూచన లు జారీ చేశారు. తరగతి గదులను పరిశీలించిన ఆయన కళాశాలల్లో నెలకొన్న సమస్యలు, సిబ్బంది కొరత తదితర అంశాలపై ఆరా తీశారు. స మస్యలు తన దృష్టికి తీసుకొస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. కరోనా థర్డ్‌వేవ్‌నేపథ్యంలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులు నమోదవుతున్నాయని అందరు అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీ సుకోవాలని కోరారు. విధిగా ప్రతి ఒక్కరు మాస్కులు దరించడంతో పాటు వ్యాక్సిన్‌ తీసుకోవాలన్నారు. ఆయన వెంట ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లు, ప్రధానోపాధ్యాయులు, తదితరలు ఉన్నారు.

Updated Date - 2021-12-07T05:36:29+05:30 IST