యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి
ABN , First Publish Date - 2021-12-10T03:45:35+05:30 IST
యాసంగిలో వరి కి బదులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని కలెక్టర్ భారతి హోళికేరి సూచించారు. గురువారం దండేపల్లి మండలం లోని ధర్మారావుపేటలో రైతులకు అవగాహన కల్పించారు. కలె క్టర్ మాట్లాడుతూ వరి పంటను కేంద్రం కొనుగోలు చేసే అవ కాశం లేనందున కొనుగోలు కేంద్రాలు ఉండవన్నారు.

లక్షెట్టిపేటరూరల్(దండేపల్లి), డిసెంబరు 9: యాసంగిలో వరి కి బదులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని కలెక్టర్ భారతి హోళికేరి సూచించారు. గురువారం దండేపల్లి మండలం లోని ధర్మారావుపేటలో రైతులకు అవగాహన కల్పించారు. కలె క్టర్ మాట్లాడుతూ వరి పంటను కేంద్రం కొనుగోలు చేసే అవ కాశం లేనందున కొనుగోలు కేంద్రాలు ఉండవన్నారు. రైతులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని పేర్కొన్నారు. విత్తన ఉత్పత్తి కంపెనీలు, రైసు మిల్లర్లతో అగ్రిమెంటు ఉన్న రైతులు మాత్రమే వరి సాగు చేయాలని సూచించారు. కార్యక్రమం లో ఎంపీడీవో శ్రీనివాస్, ఏఈవోలు పాల్గొన్నారు.
బెల్లంపల్లి: మాలగురిజాలలో ప్రత్యామ్నాయ పంటలపై ఏడీఏ సురేఖ రైతులకు అవగాహన కల్పించారు. ఆమె మాట్లాడు తూ యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవని, ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని సూచించారు. వేరుశ నగ, పెసర విత్తనాలు ప్రాథమిక సహకార సంఘాల్లో అందు బాటులో ఉన్నాయన్నారు. మండల వ్యవసాయాధికారి ప్రేమ్‌కు మార్, సర్పంచు అశోక్, ఏఈవో శ్రీనివాస్, కార్యదర్శి కార్తీక్, పాల్గొన్నారు. బూదాకలాన్‌లో ఏవో ప్రేంకుమార్, ఏఈ నాగదీప్తిలు రైతులకు అవగాహన కల్పించారు.
చెన్నూరురూరల్: ఆస్నాద్, నాగాపూర్, అక్కపల్లి, గుడ్డిరాం పూర్, బావురావు పేట, కిష్టంపేట, నర్సక్కపేట గ్రామాల్లోని రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై మండల వ్యవసాయాధికారి మహేం దర్ అవగాహన కల్పించారు. వ్యవసాయ విస్తర ణ అధికారులు వనదేవి, రాజశేఖర్, రమ్య, అం జలి, సాగర్, దివ్య, జైను పాల్గొన్నారు.