యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి

ABN , First Publish Date - 2021-10-26T03:20:49+05:30 IST

యాసం గిలో ధాన్యం కాకుండా రైతులు ప్రత్యామ్నాయ పం టలపై దృష్టి సారించాలని కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మం దిరంలో ట్రైనీ కలెక్టర్‌ ప్రతిభాసింగ్‌, జిల్లా వ్యవసా యాధికారి వినోద్‌కుమార్‌తో కలిసి వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు, వ్యవసాయ శాస్త్రవే త్తలతో సమావేశం నిర్వహించారు.

యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ భారతి హోళ్లికేరీ

మంచిర్యాల కలెక్టరేట్‌, అక్టోబరు 25: యాసం గిలో ధాన్యం కాకుండా రైతులు ప్రత్యామ్నాయ పం టలపై దృష్టి సారించాలని కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మం దిరంలో ట్రైనీ కలెక్టర్‌ ప్రతిభాసింగ్‌, జిల్లా వ్యవసా యాధికారి వినోద్‌కుమార్‌తో కలిసి వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు, వ్యవసాయ శాస్త్రవే త్తలతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లా డుతూ ఈయేడు యాసంగిలో వరికి బదులు పప్పు ధాన్యాలు, నూనెగింజల పంటలు సాగు చేసే విధంగా రైతులను సమాయత్తం చేయాలని, ఈ నెల 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించాల న్నారు. పంట మార్పిడి చేయడం వల్ల భూసారం  పెరుగుతుందన్నారు. జిల్లాలో యాసంగిలో లక్ష ఎక రాల్లో  వరి సాగు చేసే అవకాశం ఉందని తెలిపా రు. మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటలు వేసేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ విష యాలను రైతులు దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నా య పంటల వైపు శ్రద్ధ చూపాలన్నారు.  ప్రత్యా మ్నాయ పంటలు సాగు చేసే విధంగా రైతులు సన్నద్ధం కావాలన్నారు. ప్రత్యామ్నాయ పంటలపై కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజేశ్వర్‌ నాయక్‌  వ్యవసాయ శాఖ సిబ్బందికి అవగాహన కల్పించా రు. సమావేశంలో కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డి నేట ర్‌ రాజేశ్వర్‌నాయక్‌, ఆయిల్‌పామ్‌ సంస్థ ప్రతినిధి ఉదయ్‌ కుమార్‌, తెలంగాణ సీడ్స్‌ ప్రతినిధి భావన,  శాస్త్రవేత్తలు, అధికారు లు పాల్గొన్నారు. 

కరోనా వ్యాక్సిన్‌ వందశాతం పూర్తయ్యేలా చర్యలు 

కరోనా వ్యాక్సినేషన్‌ను వంద శాతం పూర్తి చేసే విధంగా అందరూ సహకరించాలని కలెక్టర్‌ భారతి హోళికేరి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ ఆవరణలో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కళాజాత ప్రదర్శన మొబైల్‌ వ్యాన్‌లను జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ కరోనా నియంత్రణకు పాటించాల్సిన వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత, భౌతికదూరం, తదితర విషయాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. జిల్లా సంక్షేమ అధికారి ఉమాదేవి, అగాఖాన్‌ ఫౌండేషన్‌ హెచ్‌బీసీసీ మేనేజర్‌ కృష్ణ, అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-26T03:20:49+05:30 IST