కరోనా రోగులకు అన్ని సదుపాయాలు కల్పించాలి

ABN , First Publish Date - 2021-05-19T04:23:18+05:30 IST

కరోనా రోగులకు అన్ని సదుపాయాలు కల్పించాలని జిల్లా అదనపు కలెక్టర్‌ రఘురా మ్‌శర్మ అన్నారు.

కరోనా రోగులకు అన్ని సదుపాయాలు కల్పించాలి
సమావేశానికి హాజరైన అదనపు కలెక్టర్‌ రఘురామ్‌శర్మ, ప్రజాప్రతినిధులు

- అదనపు కలెక్టర్‌ రఘురామ్‌శర్మ

- డీఎంహెచ్‌వో  కార్యాలయంలో హెచ్‌డీఎస్‌ సమావేశం

గద్వాలక్రైం, మే 18: కరోనా రోగులకు అన్ని సదుపాయాలు కల్పించాలని జిల్లా అదనపు కలెక్టర్‌ రఘురా మ్‌శర్మ అన్నారు. పట్టణంలోని డీఎంహెచ్‌వో  కార్యాలయంలో మంగళవారం హెచ్‌డీఎస్‌( ఆస్పటల్‌ డెవలవ్‌మెంట్‌ సొసైటీ) సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య అతిఽథిగా జిల్లా అదనపు కలెక్టర్‌ రఘురామ్‌శర్మ, జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, అబ్రహాం హాజరయ్యారు. సమావేశంలో పట్టణంలోని కొవిడ్‌-19 వార్డులోని కొవిడ్‌ రోగులకు ఆక్సిజన్‌ సరఫరా, మందుల కొరత లేకుండా చూడటం, భోజన వ సతి, శానిటేషన్‌ తదితర సేవలు సక్రమంగా అందించాలని తీర్మానించారు. అనంతరం అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ కొవిడ్‌ వార్డు ముందు, ఆసుపత్రి పరిసరాలలో నీరు నిల్వ ఉండకుండా లెవల్‌ చేయించాలని, కొవిడ్‌ వార్డులో పని చేసేందుకు స్టాప్‌ నర్సులు,  వా ర్డు బాయ్స్‌, శానిటేషన్‌ వర్కర్లు, టెక్నీనియషన్స్‌ అవస రం మేరకు నియమించుకోవాలన్నారు. అలాగే కొవిడ్‌ వార్డులో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా వైద్యులు ఎప్పుడు అందుబాటులో ఉండేలా చూడాలని, అలం పూర్‌ సీహెచ్‌సీ కొవిడ్‌ వార్డులో రెండు ఆక్సిజన్‌ బెడ్స్‌ ఏర్పాటు చేసి  రోగులకు సేవలు అందించాలన్నారు. సమావేశంలో  డీఎంహెచ్‌వో డాక్టర్‌ చందూనాయక్‌, మునిసిపల్‌ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌, వైద్యులు పాల్గొన్నారు. 

  వైద్యసిబ్బంది సేవలు అభినందనీయం

కరోనా కష్టకాలంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్లు, వైద్య సిబ్బంది చేస్తున్న సేవలు అభినందనీయమని అదనపు కలెక్టర్‌ రఘురామ్‌ శర్మ అన్నారు.   ఇటీవలే కరోనా బారిన పడి కోలుకున్న పా గుంట గ్రామానికి చెందిన సోమశేఖర్‌రెడ్డి కరోనా వా ర్డులో రోగుల కోసం హాట్‌ వాటర్‌ డిస్పెన్సరీని మం గళవారం  అదనపు కలెక్టర్‌ చేతుల మీదుగా డాక్టర్లకు అందజేశారు.  కార్యక్రమంలో డీఎస్పీ యాదగిరి, ఇన్‌ చార్జి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ చందూనాయక్‌, ఆర్‌ ఎంవో వృశాలి, టీఆర్‌ఎస్‌ నాయకులు చక్రధర్‌రెడ్డి, సాయిశ్యామ్‌రెడ్డి, పాషా, రెహమాన్‌ తదితరులున్నారు.

Updated Date - 2021-05-19T04:23:18+05:30 IST