ప్రతీ ఒక్కరికి ఆల్బెండజోల్‌ మాత్రలు అందించాలి

ABN , First Publish Date - 2021-07-14T04:15:00+05:30 IST

జిల్లాలో 2 సంవత్సరాల వయ సుపై బడిన ప్రతీ ఒక్క రికి బోదకాలు నివారణ మాత్రలు అందేలా సం బంధిత శాఖల సమన్వయంతో చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ భారతి హొళికేరి అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జాతీయ కీటక జనిత వ్యాధుల నివారణ కార్యక్రమ పర్యవేక్షకురాలు డా.రాజశ్రీ, జిల్లా వైద్యాధికారులు, మున్సిపల్‌ కమిషనర్లు, సబ్‌ యూనిట్‌ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు.

ప్రతీ ఒక్కరికి ఆల్బెండజోల్‌ మాత్రలు అందించాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ భారతి హొళికేరి

మంచిర్యాల కలెక్టరేట్‌, జూలై 13 : జిల్లాలో 2 సంవత్సరాల వయ సుపై బడిన ప్రతీ ఒక్క రికి బోదకాలు నివారణ మాత్రలు అందేలా సం బంధిత శాఖల సమన్వయంతో చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ భారతి హొళికేరి అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జాతీయ కీటక జనిత వ్యాధుల నివారణ కార్యక్రమ పర్యవేక్షకురాలు డా.రాజశ్రీ, జిల్లా వైద్యాధికారులు, మున్సిపల్‌ కమిషనర్లు, సబ్‌ యూనిట్‌ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ బోదకాలు వ్యాధి రాకుం డా డీఈసీ, ఆల్బెండజోల్‌ మాత్రలను అంగన్‌వాడీ, ఆరోగ్య, ఆశ కార్యకర్తలు, మున్సిపల్‌ రీసోర్స్‌పర్సన్స్‌, స్వయం సహాయక బృందాల సభ్యులు అందించాలన్నారు. జిల్లాలో 8 లక్షల 8 వేల 507 జనాభా ఉందని, ఇందులో 7 లక్షల 96 వేల 628 మంది 2 సంవత్సరాల పైబడిన వారందరికి మాత్రలు ఇవ్వాలన్నారు. గర్భవతులు, గుండె, కిడ్నీ, ఊపిరితిత్తు ల వ్యాధులతో బాధపడుతున్న వారు మాత్రలు వేసుకోవద్దని, కొవిడ్‌ పాజిటివ్‌ ఉన్న వారికి ఐసోలేషన్‌ గడువు పూర్తయిన తరువాత ఇవ్వాలన్నారు. జిల్లాలో 1600 బృందాలు ఏర్పాటు చేశామని, ప్రతీ బృందానికి 250 మంది జనాభాను కేటాయిస్తూ ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈనెల 15న 80 శాతం పూర్తయ్యే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. 16, 17 తేదీలలో మిగిలిన వారికి ఇవ్వాలన్నారు.  కార్యక్రమ నిర్వహణ కోసం 30 మంది వైద్యాధికారులు, 49 మంది సూపర్‌వైజర్లు, 243 మంది ఆరోగ్య కార్యకర్తలు, 662 మంది ఆశ కార్యకర్తలు, 930 మంది అంగన్‌వాడీ, 1525 మం ది ఇతర స్వచ్ఛంద కార్యకర్తలను నియమించామన్నారు. ప్రోగ్రాం ఆఫీసర్‌ డా.నీరజ, జిల్లా ఉపవైద్యాధికారి డా.ఫయాజ్‌ఖాన్‌, జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేషాద్రి, మున్సిపల్‌ కమిషనర్లు పాల్గొన్నారు. 

లక్షెట్టిపేట: లక్షెట్టిపేట ప్రభుత్వాసుపత్రిలో ఏఎన్‌ఎం, ఆశ కార్యకర్తలకు జాతీయ బోదకాల నివారణపై శిక్షణ కార్య క్రమాన్ని నిర్వహించారు. వైద్యుడు ప్రసాద్‌రావు మాట్లాడుతూ ఈనెల 15, 16, 17 తేదీల్లో అన్ని  గ్రామాల్లో  ప్రతీ ఇంటికి ఆల్చెండజోల్‌ మాత్రలు పంపిణీ చేస్తారని, ప్రజలందరు మాత్రలను వేసుకోవాలని  కోరారు. హెచ్‌ఐవో ముక్తి యార్‌ హుస్సేన్‌, సూపర్‌వైజర్‌ లక్ష్మణ్‌, స్వామి పాల్గొన్నారు. 

తాండూర్‌:  ఈనెల 15 నుంచి మూడు రోజుల పాటు ఆల్బెండజోల్‌ మాత్రల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు  వైద్యాధికారి కుమారస్వామి తెలిపారు. ఆహారం తీసుకున్న తర్వాతనే మాత్రలు మింగాలని, రెండేళ్ల లోపు పిల్లలు, గర్భిణీలకు మాత్రలు ఇవ్వకూడదని ఆయన తెలిపారు.  

Updated Date - 2021-07-14T04:15:00+05:30 IST