ఆదిలాబాద్‌లో దొంగల బీభత్సం

ABN , First Publish Date - 2021-02-05T13:03:28+05:30 IST

జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. కలెక్టరేట్‌ దగ్గర ఏటీఎంను దుండగులు ఎత్తుకెళ్లారు. అశోక్‌ రోడ్డులో ఏటీఎంను పగులగొట్టారు.

ఆదిలాబాద్‌లో దొంగల బీభత్సం

ఆదిలాబాద్: జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. కలెక్టరేట్‌ చౌక్‌లో ఏటీఎం చోరీకి దుండగులు విఫలయత్నం చేశారు. శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. తాళ్లతో కట్టి కారులో ఏటీఎంను దుండగులు తీసుకెళ్లారు.  శివారులో ఏటీఎంను దొంగలు వదిలివెళ్ళారు. అలాగే దేవి చంద్‌చౌక్‌లో నగల దుకాణంలో చోరీకి యత్నించారు. కాగా పోలీస్ పెట్రోలింగ్ వాహనం రావడంతో దుండగులు పరారయ్యారు. విషయం తెలిసిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. డీఎస్పీ వెంకటేశ్వరరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. 

Updated Date - 2021-02-05T13:03:28+05:30 IST